Mankatha 3 days Box Office: మంగాథ కలెక్షన్ల సునామీ.. అజిత్ మూవీ హిస్టరీ.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
సౌత్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన మంగాథ చిత్రం తమిళనాడులో రికార్డులు తిరుగరాస్తున్నది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రీ రిలీజై వసూళ్లను భారీగా కురిపిస్తున్నది. ఈ చిత్రం రీ రిలీజ్ చిత్రాల కోవలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం మూడు రోజుల్లో ఇప్పటి వరకు రీ రిలీజైన అన్ని చిత్రాల రికార్డులను తిరగరాసి మూడు రోజుల్లో ఎదురులేని కలెక్షన్లను సాధించింది.
మంగాథ సినిమాను దయానిధి అళగిరి నిర్మించిన చిత్రం మంగాథ. 2011 రిలీజై ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, లక్ష్మీరాయ్, అంజలి, ఆండ్రియా జెర్మియా, వైభవ్ రెడ్డి, మహత్ రాఘవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం, శక్తి శరవణన్ సినిమాటోగ్రఫి, కేఎల్ ప్రవీణ్, శ్రీకాంత్ ఎన్‌బీ ఎడిటర్లుగా వ్యవహరించారు. క్లౌడ్ నైన్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన రిలీజైంది. ఈ సినిమా జనవరి 23వ తేదీన మరోసారి గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు విజయ్ నటించిన గిల్లీ చిత్రం, సచిన్ చిత్రాలు 10 కోట్ల మార్కును దాటాయి. అలాగే మహేష్ బాబు నటించిన ఖలేజా, రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి: ది ఎపిక్ చిత్రాలు కూడా 10 కోట్లకుపైగా వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం అజిత్ చిత్రం ఆ రికార్డులను తిరగరాసి తమిళ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగరాసింది.
మంగాథ చిత్రం తొలి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసింది. తొలి రోజు 4.65 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.33 కోట్ల రూపాయలు, మూడో రోజు 3.57 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఈ సినిమా 11.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా తమిళనాడులో క్రేజీగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
తమిళనాడులో 3 రోజుల్లో రీ రిలీజ్ సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మంగాథ 11.55 కోట్లు, గిల్లీ 9.3 కోట్లు, రజనీకాంత్ నటంచిన పడయప్పా 8.5 కోట్లు, సచిన్ 5.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
మంగాథ చిత్రం అజిత్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి గుర్తు చేసింది. తమిళనాడులో అగ్ర హీరోలు రజనీకాంత్, విజయ్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాకుండా దక్షిణాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన రీ రీలీజ్ చిత్రం రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications











