Mankatha Re Release Collections: మంగాథ మూవీకి రికార్డు కలెక్షన్లు.. అజిత్ సినిమాకు ఊహించని క్రేజ్!

తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో దయానిధి అళగిరి నిర్మించిన చిత్రం మంగాథ. 2011 రిలీజై ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, లక్ష్మీరాయ్, అంజలి, ఆండ్రియా జెర్మియా, వైభవ్ రెడ్డి, మహత్ రాఘవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం, శక్తి శరవణన్ సినిమాటోగ్రఫి, కేఎల్ ప్రవీణ్, శ్రీకాంత్ ఎన్‌బీ ఎడిటర్లుగా వ్యవహరించారు. క్లౌడ్ నైన్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన రిలీజైంది. ఈ సినిమా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా మరోసారి రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా సాధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ముంబైలో ఏసీపీగా పనిచేసే వినాయక్ మహాదేవన్ (అజిత్) అవినీతి పరుడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాతో చేతులు కలుపుతాడు. ఫైజల్‌ అనే స్మగ్లర్‌ను ఎన్‌కౌంటర్ బారి నుంచి కాపాడిన విషయంలో సస్పెండ్ అవుతాడు. ఐపీఎల్ గ్యాంబ్లింగ్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతాడు. ఇలాంటి అంశాలతో కూడిన కేసును దర్యాప్తను పృథ్వీరాజ్ చేపడుతాడు. తర్వాత ఈ కేసులో ఏం జరిగింది? సంజన (త్రిష)తో వినాయక్ రిలేషన్ ఎలా సాగింది? వినాయక్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

Mankatha Re Release Box office

ముంబై‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా, ఐపీఎల్ గ్యాంబ్లింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా భారీ విజయంతో సాధించడంతోపాటు రికార్డు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో సుమారుగా 90 కోట్ల రూపాయల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా దక్షిణాదిలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేశారు.

అజిత్ కుమార్‌కు తమిళంలో ఉన్న క్రేజ్‌ను మరోసారి ఈ చిత్రం చాటిచెప్పింది. ఈ సినిమా రీ రిలీజైన ప్రతీ సెంటర్‌లోను భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సాధించింది. తొలి రోజు చెన్నైలో 75 లక్షల రూపాయలు, కోయంబత్తూరులో 15 లక్షలు, మధుర 11 లక్షలు, త్రిచీ 7 లక్షలు, తిరువన్నెలవెళి 4.5 లక్షలు, కాంచీపురంలో 3 లక్షలు, పాండిచ్చేరి 2.3 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 12 లక్షలు వసూలు చేసింది.

తమిళనాడులో 1.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో ఈ సినిమా 9 లక్షలు, కేరళలో 1.6 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మూడు రాష్ట్రాల్లో 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా రెండు రోజులు సమయం ఉన్నది కాబట్టి రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టు గురించిన వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Read more about: mankatha ajith box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X