Mankatha Day 1 Box Office: తమిళనాడులో మంగాథ సరికొత్త రికార్డు.. అజిత్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో దయానిధి అళగిరి నిర్మించిన చిత్రం మంగాథ. 2011 రిలీజై ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, లక్ష్మీరాయ్, అంజలి, ఆండ్రియా జెర్మియా, వైభవ్ రెడ్డి, మహత్ రాఘవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం, శక్తి శరవణన్ సినిమాటోగ్రఫి, కేఎల్ ప్రవీణ్, శ్రీకాంత్ ఎన్‌బీ ఎడిటర్లుగా వ్యవహరించారు. క్లౌడ్ నైన్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన రిలీజైంది. ఈ సినిమా జనవరి 23వ తేదీన మరోసారి గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మంగాథ చిత్రం తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. విజయ్ నటించిన గిల్లీ సినిమా తొలి రోజు కోసం 2.15 కోట్ల రూపాయల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం అప్పట్లో రికార్డుగా భావించారు. ప్రస్తుతం అజిత్ నటించిన మంగాథ చిత్రం 2.16 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

మంగాథ చిత్రం మూడు రాష్ట్రాలు అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తున్నది. ఈ చిత్రం బెంగళూరులో రికార్డు వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కోసం 13.75 లక్షల రూపాయలను రాబట్టడమే కాకుండా రజనీకాంత్ నటించిన పడయప్పా రీ రిలీజ్ వసూలు చేసిన 12.65 లక్షల రూపాయల కలెక్షన్లను అధిగమించింది. ఇలా మూడు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీగా అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లను రాబట్టింది.
అయితే మంగాథ చిత్రం రీ రిలీజ్‌కు జనవరి 23వ తేదీన తలా ఫ్యాన్స్ పొటేత్తారు. తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల్లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులతో స్క్రీన్లు కిక్కిరిసిపోయాయి. దాదాపు మూడు, నాలుగు రోజులు రాష్ట్రంలో ఇదే విధంగా అభిమానుల జాతర ఉంటుందని థియేటర్ యాజమాన్యాలు, ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం.. అజిత్ నటించిన ఈ సినిమా రీ రిలీజ్ రూపంలో తొలి రోజు వసూళ్ల పరంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం తొలి రోజు 3.27 కోట్ల రూపాయలు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ చిత్రాల్లో ఇదే అత్యుత్తమ వసూళ్లు. గతంలో విజయ్ సినిమా గిల్లీ 3.09 కోట్లు, రజనీకాంత్ నటించిన పడయప్పా 2.28 కోట్లు, సచిన్ చిత్రం 1.76 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇదిలా ఉండగా, దక్షిణాదిలో ఇప్పటి వరకు రీ రిలీజ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. విజయ్ నటించిన గిల్లీ చిత్రం తొలి రోజు 10.6 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం 8.26 కోట్లు, గబ్బర్ సింగ్ చిత్రం 8.02 కోట్లు వసూలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











