Mankatha Day 2 Box Office: 1 లక్ష టికెట్లతో చరిత్ర సృష్టించిన మంగాథ.. అజిత్ మూవీకి ఎన్ని కోట్లంటే?
తమిళ సూపర్ స్టార్ అజిత్ కెరీర్‌లో 50వ చిత్రంగా రూపొందిన మంగాథ రీ రిలీజై సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో దయానిధి అళగిరి నిర్మించారు. 2011 రిలీజై ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, లక్ష్మీరాయ్, అంజలి, ఆండ్రియా జెర్మియా, వైభవ్ రెడ్డి, మహత్ రాఘవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం, శక్తి శరవణన్ సినిమాటోగ్రఫి, కేఎల్ ప్రవీణ్, శ్రీకాంత్ ఎన్‌బీ ఎడిటర్లుగా వ్యవహరించారు.
క్లౌడ్ నైన్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన రిలీజైంది. కల్ట్ ఫ్యాన్స్ ఉన్న ఈ సినిమాను జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా మరోసారి రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం తొలి రోజు రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. ఈ చిత్రం రెండో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..

క్రికెట్ బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌గా ముంబై నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాలో అవినీతి అధికారిగా, సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో విలన్‌గా అర్జున్ సర్జా కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందని ప్రకటించగానే.. తలా అభిమానుల్లో జోష్ పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్‌కు కేక పెట్టించారు. రిలీజ్‌కు ముందు గత 24 గంటల్లో లక్ష టికెట్లు బుక్ మై షోలోనే అమ్ముడుపోవడం రికార్డుగా మారింది.
తమిళనాడులోనే కాకుండా కర్ణాటక, కేరళలో ఈ సినిమా ఫీవర్ స్పష్టంగా కనిపించింది. కన్నడలో ఈ చిత్రం గిల్లీ, పడయప్పా చిత్రాల వసూళ్లను అధిగమించింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 5 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయగా.. వరల్డ్ వైడ్‌గా 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది అని అజిత్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా రానున్న రెండు, మూడు రోజుల్లో రికార్డు వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తమిళనాడులో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో రికార్డు స్థాయిలో షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో దాదాపు 11 షోలకుపైగా ప్రదర్శిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పలు చోట్ల డిమాండ్ విపరీతంగా ఉండటంతో అదనపు షోలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కమల థియేటర్‌లో మంగళవారం వరకు టికెట్లనీ అమ్ముడుపోయినట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఇలాంటి క్రేజ్ మధ్య మంగాథ చిత్రం రెండొ రోజు కూడా భారీ వసూళ్లు నమోదు చేసేందుకు సిద్దమైంది. ఈ చిత్రం రెండో రోజు 2 నుంచి 3 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా మారే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











