Mankatha 5 Days Box Office: తమిళంలో మంగాథ రీ రిలీజ్ కలెక్షన్ల విధ్వంసం.. అజిత్ మూవీకి ఎన్ని కోట్లంటే?
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన మంగాథ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తున్నది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీ రిలీజ్ సినిమాల కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా తమిళనాడులోనే కాకుండా కేరళ, కర్ణాటక, ఓవర్సీస్‌లో సంచలన రీతిలో వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాల్లోను, అభిమానుల్లోను జోష్ పుట్టిస్తున్నది. ఈ సినిమా గత 5 రోజులుగా తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇండియాలో మంగాథ చిత్రం తొలి రోజు 3.59 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.64 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.84 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 1.7 కోట్ల రూపాయలు, ఐదో రోజు 75.7 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత 5 రోజుల్లో 11.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులో ఈ సినిమా అత్యధికంగా వసూళ్లను సాధించింది. మొదటి రోజు 3.3 కోట్లు, రెండో రోజు 2.5 కోట్లు, మూడో రోజు 2.62 కోట్లు, నాలుగో రోజు 1.57 కోట్లు, ఐదో రోజు 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం తొలి రోజు 23 లక్షలు, రెండో రోజు 14 లక్షలు, మూడో రోజు 16 లక్షల రూపాయలు, నాలుగోరోజు 2.5 లక్షలు, ఐదో రోజు 2.6 లక్షల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక కేరళలో ఈ సినిమా తొలి రోజు 4 లక్షల రూపాయలు, రెండో రోజు 2.5 లక్షలు, మూడో రోజు 3.5 లక్షలు, నాలుగో రోజు 2 లక్షలు, ఐదో రోజు 1.75 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా సుమారుగా 11.5 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.
ఇదిలా ఉంటే.. ఓవర్సీస్‌లో కూడా పరిమితమైన షోలు ప్రదర్శించినప్పటికీ.. భారీగానే వసూళ్లను సాధించింది. ఈ చిత్రం సుమారుగా 2 కోట్ల రూపాయలను నార్త్ అమెరికా, ఇతర ప్రాంతాల్లో వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 13 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం రజనీకాంత్ నటించిన పడయప్పా, విజయ్ నటించిన గిల్లీ సినిమాల రీరిలీజ్ వసూళ్లపై కన్నేసింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తమిళ సూపర్ స్టార్ అజిత్ కెరీర్‌లో 50వ చిత్రంగా రూపొందిన మంగాథ రీ రిలీజై సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో దయానిధి అళగిరి నిర్మించారు. 2011 రిలీజై ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, లక్ష్మీరాయ్, అంజలి, ఆండ్రియా జెర్మియా, వైభవ్ రెడ్డి, మహత్ రాఘవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం, శక్తి శరవణన్ సినిమాటోగ్రఫి, కేఎల్ ప్రవీణ్, శ్రీకాంత్ ఎన్‌బీ ఎడిటర్లుగా వ్యవహరించారు. క్లౌడ్ నైన్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన రిలీజైంది. కల్ట్ ఫ్యాన్స్ ఉన్న ఈ సినిమాను జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా మరోసారి రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











