Mankatha 8 Days Box Office: విజయ్ రికార్డును కొట్టలేకపోయిన అజిత్.. మంగాథ మూవీకి ఎన్ని కోట్లంటే?
తమిళ సూపర్ స్టార్ అజిత్ కెరీర్‌లో 50వ చిత్రంగా రూపొందిన మంగాథ రీ రిలీజై సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో దయానిధి అళగిరి నిర్మించారు. 2011 రిలీజై ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, లక్ష్మీరాయ్, అంజలి, ఆండ్రియా జెర్మియా, వైభవ్ రెడ్డి, మహత్ రాఘవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం, శక్తి శరవణన్ సినిమాటోగ్రఫి, కేఎల్ ప్రవీణ్, శ్రీకాంత్ ఎన్‌బీ ఎడిటర్లుగా వ్యవహరించారు. క్లౌడ్ నైన్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 31వ తేదీన రిలీజైంది. కల్ట్ ఫ్యాన్స్ ఉన్న ఈ సినిమాను జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా మరోసారి రిలీజ్ చేశారు. ఈ సినిమా గత 7 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో మంగాథ చిత్రం రీ రిలీజ్ సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను తిరగరాసింది. తొలివారం సుమారుగా 16 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గతంలో విజయ్ నటించిన గిల్లీ సినిమా సెట్ చేసిన 7 రోజుల్లో 13.45 కోట్ల వసూళ్ల రికార్డును అధిగమించింది. తమిళనాడులో రీ రిలీజ్ సినిమాలకు సంబంధించి తొలివారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఘనతను సాధించింది.

మంగాథ చిత్రం తమిళనాడు రీ రిలీజ్ చరిత్రలో ఓపెనింగ్ డే అత్యధిక వసూళ్లను, వీకెండ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లను, తొలివారం అత్యధిక వసూళ్లను, వేగంగా 5 కోట్లు, వేగంగా 10 కోట్లు, వేగంగా 15 కోట్లు కలెక్ట్ చేసిన రీ రీలీజ్ చిత్రంగా రికార్డు సెట్ చేసింది. అయితే ఈ సినిమా రెండో వారంలో కూడా అదే జోష్‌ను చూపించలేకపోయింది.
గత 8 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు 3.59 కోట్ల రూపాయలు, 2.64 కోట్లు, మూడో రోజు 2.84 కోట్లు, నాలుగో రోజు 1.71 కోట్లు, ఐదో రోజు 76 లక్షల రూపాయలు, ఆరో రోజు 65 లక్షల రూపాయలు, ఏడో రోజు 62 లక్ష్లలు, ఏనిమిదో రోజు 15 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 13 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 3 కోట్ల మేర వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 16 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడులో ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమాలు వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. విజయ్ నటించిన గిల్లీ చిత్రం 24.2 కోట్ల రూపాయలు, మంగాథ చిత్రం 16 కోట్లు, రజనీకాంత్ నటించిన పడయప్పా చిత్రం 14 కోట్ల రూపాయలు, విజయ్ నటించిన సచిన్ చిత్రం 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











