తొలి రోజు 'మన్మథుడు 2' ఎంత రాబట్టిందంటే..

టాలీవుడ్ కింగ్ నాగర్జున నటించిన తాజాగా చిత్రం మన్మథుడు 2. 2002లో వచ్చిన మన్మధుడు నాగర్జున కెరీర్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా తాజాగా మన్మధుడు 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా నిన్న (శుక్రవారం) విడుదలైంది. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాకపోతే విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి అలాగే క్రిటిక్స్ నుండి మిశ్రమ టాక్ లభించింది.

విడుదలకు ముందు ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగిన ఓపెనింగ్స్ రాబట్టగలిగి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మరోవైపు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు పెద్దగా ఆదరణ కనిపించలేదు. యూఎస్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ $82,190 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకులు రమేష్ బాలా పేర్కొన్నాడు. అయితే తెలుగు రాష్టాల్లో మొదటి రోజు ఎంతో వసూళ్లు తెలియాల్సి ఉంది.

 Manmadhudu 2 First Day Collection Report

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగర్జున తన సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సమంత, కీర్తీ సురేష్ లు అతిథి పాత్రల్లో కనిపించారు. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న మన్మథుడు 2కి ఆగస్ఠు 15న విడుదల కానున్న అడవిశేష్ 'ఎవరు', శర్వానంద్ 'రణరంగం' గట్టి పోటీ ఇస్తాయని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఆ సినిమాలను తట్టుకుని మన్మధుడు 2 ఎంతవరకు నిలబడగలుగుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X