For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 డేస్ రిపోర్ట్: ‘మన్మధుడు 2’ లాభాల్లోకి రావాలంటే ఎంత రావాలి?

|

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మధుడు 2' మూవీ తొలిరోజు నుంచే మిక్డ్స్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో పాటు క్రిటిక్స్ రివ్యూలు కూడా యావరేజ్‌గా వచ్చాయి. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై తీవ్రంగా పడింది.

ట్రైలర్ బావుండటంతో 'మన్మధుడు 2' చిత్రానికి ప్రీ రిలీజ్ హైప్ ఓరేంజిలో వచ్చింది. ఈ నేపథ్యంలో బిజినెస్ కూడా అలాగే జరిగింది. అంచనాలు బావుండటంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టడంలో సక్సెస్ అయింది. అయితే రిలీజ్ తర్వాత అంచనాలు తారుమారయ్యాయి. దీంతో సెకండ్ డే నుంచి కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి.

వీకెండ్‌తో పాటు బక్రీద్ కలిసొచ్చినా...

వీకెండ్‌తో పాటు బక్రీద్ కలిసొచ్చినా...

ఈ సారి వీకెండ్‌తో పాటు బక్రీద్ పండగ రూపంలో ‘మన్మధుడు 2' చిత్రానికి అదనంగా మరొక హాలిడే కలిసొచ్చింది. అయితే దీని వల్ల సినిమాకు కలెక్షన్ల పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదని 4 రోజుల వసూళ్లు పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

Manmadhudu 2, Kobbari Matta & Kurukshetram Box-Office Report || Filmibeat Telugu
4 రోజుల వసూళ్ల వివరాలు ఇవే...

4 రోజుల వసూళ్ల వివరాలు ఇవే...

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మన్మధుడు 2 మూవీ తొలి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.65 కోట్లు రాబట్టింది. వరుసగా 4 రోజులు హాలిడే వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ సర్కిల్‌లో చర్చించుకుంటున్నారు.

ఏరియా వైజ్

ఏరియా వైజ్

నైజాం ఏరియాలో రూ. 2.35 కోట్లు షేర్ తొలి 4 రోజుల్లో వసూలు చేసింది. సీడెడ్ ఏరియాలో రూ. 90 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, గుంటూరులో రూ. 86 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, కృష్ణలో రూ. 58 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలు రాబట్టింది. రెస్టాఫ్ ఇండియాలో 1 కోటి, ఓవర్సీస్‌లో రూ. 95 లక్షలు వసూలు చేసింది.

లాభాలు రావాలంటే ఇంకా ఎంత రావాలి?

లాభాలు రావాలంటే ఇంకా ఎంత రావాలి?

‘మన్మధుడు 2' మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 20.50 కోట్లకు అమ్మారు. సినిమా బ్రేక్ ఈవెన్ పాయింటును అందుకోవాలంటే ఇంకా 12 కోట్లు వసూలు కావాలి. డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే అంతకు మించి రాబట్టాల్సి ఉంది.

జనాలకు మెల్లిగా ఎక్కుతుంది అనే నమ్మకంలో నాగార్జున

జనాలకు మెల్లిగా ఎక్కుతుంది అనే నమ్మకంలో నాగార్జున

అయితే ‘మన్మధుడు 2' మూవీకి మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులకు మెల్లిగా ఎక్కుతుంది అనే నమ్మకంతో ఉన్నారు నాగార్జున. గతంలో తన సూపర్ హిట్ చిత్రాలు గీతాంజలి, నిర్ణయం, అన్నమయ్య తొలివారం తర్వాత పుంజుకున్నాయని, మన్మధుడు 2 మూవీపై కూడా అదే విధమైన నమ్మకం ఉందని ఇటీవల ప్రెస్ మీట్లో వెల్లడించారు. మరి ఆయన నమ్మకం ఏమేరకు నిజం అవుతుందో చూడాలి.

English summary
Nagarjuna’s Manmadhudu 2 collected total is Rs 8.65 cr worldwode. Manmadhudu 2 is a 2019 Telugu-language romantic comedy film, produced by Nagarjuna Akkineni, P.Kiran under Annapurna Studios, Anandi Art Creations, Viacom18 Motion Pictures banners and directed by Rahul Ravindran. It stars Nagarjuna Akkineni, Rakul Preet Singh in the lead roles and music composed by Chaithan Bharadwaj.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more