Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
4 డేస్ రిపోర్ట్: ‘మన్మధుడు 2’ లాభాల్లోకి రావాలంటే ఎంత రావాలి?
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మధుడు 2' మూవీ తొలిరోజు నుంచే మిక్డ్స్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో పాటు క్రిటిక్స్ రివ్యూలు కూడా యావరేజ్‌గా వచ్చాయి. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై తీవ్రంగా పడింది.
ట్రైలర్ బావుండటంతో 'మన్మధుడు 2' చిత్రానికి ప్రీ రిలీజ్ హైప్ ఓరేంజిలో వచ్చింది. ఈ నేపథ్యంలో బిజినెస్ కూడా అలాగే జరిగింది. అంచనాలు బావుండటంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టడంలో సక్సెస్ అయింది. అయితే రిలీజ్ తర్వాత అంచనాలు తారుమారయ్యాయి. దీంతో సెకండ్ డే నుంచి కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి.
వీకెండ్‌తో పాటు బక్రీద్ కలిసొచ్చినా...
ఈ సారి వీకెండ్‌తో పాటు బక్రీద్ పండగ రూపంలో ‘మన్మధుడు 2' చిత్రానికి అదనంగా మరొక హాలిడే కలిసొచ్చింది. అయితే దీని వల్ల సినిమాకు కలెక్షన్ల పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదని 4 రోజుల వసూళ్లు పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
Recommended Video
4 రోజుల వసూళ్ల వివరాలు ఇవే...
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మన్మధుడు 2 మూవీ తొలి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.65 కోట్లు రాబట్టింది. వరుసగా 4 రోజులు హాలిడే వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ సర్కిల్లో చర్చించుకుంటున్నారు.
ఏరియా వైజ్
నైజాం ఏరియాలో రూ. 2.35 కోట్లు షేర్ తొలి 4 రోజుల్లో వసూలు చేసింది. సీడెడ్ ఏరియాలో రూ. 90 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, గుంటూరులో రూ. 86 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, కృష్ణలో రూ. 58 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలు రాబట్టింది. రెస్టాఫ్ ఇండియాలో 1 కోటి, ఓవర్సీస్లో రూ. 95 లక్షలు వసూలు చేసింది.
లాభాలు రావాలంటే ఇంకా ఎంత రావాలి?
‘మన్మధుడు 2' మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 20.50 కోట్లకు అమ్మారు. సినిమా బ్రేక్ ఈవెన్ పాయింటును అందుకోవాలంటే ఇంకా 12 కోట్లు వసూలు కావాలి. డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే అంతకు మించి రాబట్టాల్సి ఉంది.
జనాలకు మెల్లిగా ఎక్కుతుంది అనే నమ్మకంలో నాగార్జున
అయితే ‘మన్మధుడు 2' మూవీకి మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులకు మెల్లిగా ఎక్కుతుంది అనే నమ్మకంతో ఉన్నారు నాగార్జున. గతంలో తన సూపర్ హిట్ చిత్రాలు గీతాంజలి, నిర్ణయం, అన్నమయ్య తొలివారం తర్వాత పుంజుకున్నాయని, మన్మధుడు 2 మూవీపై కూడా అదే విధమైన నమ్మకం ఉందని ఇటీవల ప్రెస్ మీట్లో వెల్లడించారు. మరి ఆయన నమ్మకం ఏమేరకు నిజం అవుతుందో చూడాలి.