తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ నేను మీకు తెలుసా సినిమా ప్రోమోలు.మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కుమార్ కొంత విరామం తర్వాత చేస్తున్న సినిమా ఇది.ఎడ్వర్టైజింగ్ రంగం నుంచి వచ్చిన అజయ్ శాస్త్రి దీనికి దర్శకుడు.రియాసేన్,స్నేహా ఉల్లాల్ హీరోయిన్లు.ఇందులో హీరోకు తలకు దెబ్బ తగిలి రోజు వారి జరగే సంఘటనలు మర్చిపోతూంటాడుట.ఆ క్రమంలో ఓ క్రైమ్ లో ఇరుక్కుంటాడట.మరో ప్రక్క చక్కని లవ్ స్టోరీ నడుస్తుందిట.ఇలాంటి పాయింటు తో హాలీవుడ్ లో వచ్చిన ది లుక్ అవుట్ సినిమా దీనికి మూలం అని పిల్మ్ నగర్ లో జోరుగా పుకార్లు పరిగెడుతున్నాయి.ఇది కరక్టో కాదో కాని సినిమా సెంట్రల్ పాయింటు బాగుంది కదా.