Marco Collections: 100 కోట్లకు చేరువగా మార్కో.. షాకింగ్‌గా ఆంధ్రా, నైజాంలో కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే!
మలయాళంలో రూపొందిన క్రైమ్, హారర్ థ్రిల్లర్ మార్కో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే భారీ వసూళ్లను సాధిస్తున్నది. కేరళ, తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా జనవరి 1వ తేదీన తెలుగు డబ్బింగ్ చిత్రంగా విడుదలై ఘనంగా కలెక్షన్ల యాత్రను ప్రారంభించింది. క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మాణంలో హానీఫ్ అదేనీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
ఇప్పటి వరకు విలన్ టచ్, సాఫ్ట్ క్యారెక్టర్లకు పరిమితమైన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, యుక్తీ తరేజా జంటగా రూపొందిన ఈ సినిమా కథ, కథనాల విషయానికి వస్తే.. ఇండియన్ సినిమా తెరపై ఇప్పటి వరకు చూడని హింస, క్రైమ్ అంశాలతో రూపొందింది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్‌కు బాక్సాఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల క్లబ్‌లో చేరింది. హిందీ, తెలుగులో భారీ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని చేపట్టింది.

మలయాళంలో ఈ సినిమా భారీగా వసూళ్లను రాబడుతున్నది. తొలి రోజు ఈ సినిమా 4.5 కోట్లతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం 28 కోట్లకుపైగా నికర కలెక్షన్లు, 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ రెండో వారంలో ఈ సినిమా 40 కోట్ల నికరంగా, 60 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
మలయాళంతోపాటు హిందీలో రిలీజైన ఈ సినిమా తొలివారం అంతంత మాత్రంగానే కలెక్షన్లు సాధించింది. తొలి వారం కేవలం 28 లక్షల నికర వసూళ్లను మాత్రమే ఈ సినిమా కలెక్ట్ చేసింది. రెండో వారంలో పుష్ప 2 ప్రభంజనానికి ధీటుగా వసూళ్లను నమోదు చేసింది. రెండో వారంలో ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలు హిందీ వెర్షన్ రాబట్టింది. రెండో వారంలో ప్రతీ రోజు కలెక్షన్లు పెరుగుతూ ఉండటం ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తున్నది.

మార్కో చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబడతుతున్నది. ఇప్పటి వరకు ఈ సినిమా 3.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా తమిళనాడు, కన్నడ రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.
ఇక తెలుగులో జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం కానుకగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు ఘనంగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 1.25 కోట్ల నికర కలెక్షన్లు, 3 కోట్ల గ్రాస్ వసూళ్లను ఆంధ్రా, నైజాం రాష్ట్రాల్లో రాబట్టింది. ఈ సినిమా గత 13 రోజుల్లో 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











