Marco Closing Collections: మార్కో బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్లు.. ఉన్ని ముకుందన్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
మలయాళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మాణంలో హానీఫ్ అదేనీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మార్కో. మలయాళ స్టార్ యాక్టర్ ఉన్ని ముకుందన్, యుక్తీ తరేజా జంటగా రూపొందిన ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. సిద్దిఖీ, జగదీష్, సుదేవ్ నాయర్, అన్సన్ పాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కేవలం కేరళలోనే కాకుండా విడుదలైన ప్రతీ చోట కనకవర్షం కురిపించింది. ఈ మూవీ థియేట్రికల్ రన్‌లో మొత్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో
మార్కో సినిమా పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా తెరకెక్కించడం.. అవుట్ డోర్ షూటింగ్, సెట్స్ భారీగా వేయడంతోపాటు ఖర్చుకు వెనుకాడకుండా టాలెంటెడ్ టీమ్‌తో సినిమాను రూపొందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 35 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం సుమారుగా 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

మార్కో తొలివారం వసూళ్లు
ఉన్ని ముకుందన్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. కేరళలో తొలివారం ప్రభంజనం సృష్టించింది. కర్ణాటకలో భారీగా వసూళ్లను సాధించింది. మలయాళంలో తొలివారం 28 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, తమిళనాడులో 75 లక్షల రూపాయలు, తెలుగులో 25 లక్షల రూపాయలు, మిగతా రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఫస్ట్ వీక్ ఈ సినిమా 32 కోట్ల రూపాయలు రాబట్టింది.
రెండోవారం కలెక్షన్లు
మార్కో చిత్రం రెండోవారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం మలయాళంలో 10 కోట్ల రూపాయలు, తెలుగులో 2.25 కోట్లు, కర్ణాటకలో 1.2 కోట్లు, తమిళనాడులో 50 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 19.5 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలు చేసింది.
ఉన్ని ముకుందన్ మూడో వారం బాక్సాఫీస్
మార్కో చిత్రం మూడో వారంలో కూడా స్టడీగా వసూళ్లను సాధించింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకొన్నాయి. తెలుగులో అదికంగా 3.5 కోట్లు, హిందీలో 6.5 కోట్లు, మలయాళంలో 3 కోట్లు, కన్నడలో 1.5 కోట్లు, తమిళంలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
4వ వారంలో ఎంతంటే?
మర్కో సినిమా నాలుగోవారంలో భారీగా వసూళ్లు క్షీణించాయి. హిందీలో ఘనంగా వసూళ్లను రాబట్టింది. మిగితా భాషల్లో పెద్దగా వసూల్లు రాకపోవడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌కు అడ్డుకట్టపడింది. 4వ వారంలో హిందీలో 2.25 కోట్లు, మిగితా భాషల్లో కలిపి మొత్తంగా 3.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
మార్కోకు ఎన్ని కోట్ల లాభమంటే?
మార్కో సినిమా లాంగ్వేజ్ వారీగా కలెక్షన్ల విషయానికి వస్తే.. కన్నడలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 6 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 42 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో దేశీయంగా 68 కోట్ల షేర్ గ్రాస్, ఓవర్సీస్‌లో 40 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొత్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్, 55 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











