Mardaani 3 Box Office: 50 కోట్లతో మర్దానీ సంచలనం.. రాణి ముఖర్జీ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం మర్దానీ 3. స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ నటించిన ఈ సినిమాకు అభిరామ్ మినావాలా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జానకీ బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషు సేన్ గుప్తా, ప్రజేష్ కశ్యప్, ఇంద్రనీల్ భట్టాచార్య తదితరులు నటించారు.
ఈ సినిమాకు అర్థర్ జురావ్‌స్కీ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ యషా రామ్‌చందానీ, సార్థక్ కల్యాణి పాటలు, జాన్ స్టీవార్ట్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మర్ధానీ సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడో చిత్రమిది. గత రెండు చిత్రాలు ఘన విజయం సాధించిన తర్వాత ఈ మూవీ రావడం, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం రాణి ముఖర్జీ స్టామినా ఏమిటో తెలియజెప్పింది. జనవరి 30వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

మర్ధానీ 3 చిత్రాన్ని టాలెంటెడ్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్స్‌తో బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మించారు. చిత్ర యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. తొలి వారం ఈ సినిమా 26.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో 15.65 కోట్లు, మూడో వారం 5.35 కోట్లు, నాలుగో వారం 2.52 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా భారీగానే వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా ఇప్పటి వరకు 1 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 9 కోట్ల రూపాయల వసూళ్లను కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మార్కును దాటింది. ఈ చిత్రం ఇప్పటికీ 1 కోటి రూపాయలకు తక్కువ కాకుండా వసూళ్లను రాబడుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











