Mark Antony Day 2 Collections అంచనాలు మించి మార్క్ ఆంటోని కలెక్షన్లు.. విశాల్ కెరీర్‌లో రికార్డు!
తమిళంలో స్టార్ హీరో విశాల్, డైరెక్టర్ టాలెంటెడ్ యాక్టర్ ఎస్‌జే సూర్య నటించిన మార్క్ ఆంటోని చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మాస్, కమర్షియల్ అంశాలతోపాటు టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రీతూ వర్మ, అభినయ, సునీల్, సెల్వరాఘవన్ నటించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు అంచనాలకు మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మార్క్ ఆంటోని సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సుమారు 30 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్‌ను దాదాపు 38 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 40 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 40 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఇక మార్క్ ఆంటోని సినిమాను తమిళనాడులో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను 1100 స్క్రీన్లలో తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 500 స్క్రీన్ల విడుదల చేశాడు. కేరళ, కర్ణాటకలో దాదాపు 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌తో కలిపి ఈ చిత్రాన్ని దాదాపు 2900 స్క్రీన్లలో విడుదల చేశారు.
మార్క్ ఆంటోని తొలి రోజు పాజిటివ్ నోట్‌తో బాక్సాఫీస్ యాత్ర మొదలుపెట్టింది. ఈ సినిమా తొలి రోజు తమిళంలో 7.2 కోట్ల గ్రాస్, 5.5 కోట్ల షేర్, తెలుగులో 2 కోట్ల రూపాయల గ్రాస్, 1 కోటి రూపాయల షేర్ వసూలు చేసింది. దాంతో తొలి రోజు ఈ చిత్రం దాదాపు 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విశాల్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లను నమోదు చేసింది.

మార్క్ ఆంటోని రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా కలెక్షన్లను నమోదు చేసే పరిస్థితి కనిపించింది. తమిళ వెర్షన్ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 45 శాతం, మ్యాట్నీకి 50 శాతం కంటే ఎక్కువగా ఆక్యుపెన్సీ నమోదైంది. చెన్నైలో 50 శాతం, కోయంబత్తూరులో 45 శాతం, సలెం, దిండిగల్‌లో 40 శాతానికిపైగా, త్రిచీ 55 శాతం , ఢిల్లీలో 70 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తెలుగులో ఆక్యుపెన్సీ 40 శాతం నమోదైంది.

మార్క్ ఆంటోని రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు కంటే ఎక్కువగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. రెండో రోజు 6.29 కోట్ల షేర్, 8.5 కోట్ల గ్రాస్ రూపాయల కలెక్షన్లను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తున్నది.


Click it and Unblock the Notifications











