Mark Antony Day 3 Collections 50 కోట్లకు చేరువగా మార్క్ ఆంటోని.. విశాల్ మూవీ 3వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే

టాలెంటెడ్ యాక్టర్స్ విశాల్, ఎస్‌జే సూర్య ద్విపాత్రాభినయంతో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా మార్క్ అంటోని చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నది. విభిన్నమైన కంటెంట్, పిరియాడిక్, టైమ్ మిషన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా విశాల్ కెరీర్‌లో భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఎస్ వినోద్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మార్క్ ఆంటోని చిత్రాన్ని టెక్నికల్‌గా బలంగా నిర్మించడంతో బడ్జెట్ మీడియం రేంజ్‌ కంటే ఎక్కువగానే అయింది. ఈ సినిమాను 28 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని రేపడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. దాంతోఈ సినిమాను మొత్తంగా 2900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా సినిమా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

Mark Antony Movie Day 3 official Collections Worlwide: Vishal movie mints decent revenue

మార్క్ ఆంటోని సినిమా గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఇండియాలో 8.35 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగు వెర్షన్ 1.15 కోట్ల షేర్ వసూలు చేస్తే.. తమిళ వెర్షన్ 7.2 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగించింది. తమిళంలో 8.1 కోట్ల రూపాయలు, తెలుగులో 90 లక్షల షేర్ వసూలుచేసింది.

Mark Antony Movie Day 3 official Collections Worlwide: Vishal movie mints decent revenue

మార్క్ ఆంటోని తమిళ వెర్షన్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోలు కాస్త తక్కువగానే ఆక్యుపెన్సీ కనిపించింది. మ్యాట్నీ నుంచి ఆక్యుపెన్సీ పెరిగింది. మ్యాట్నీకి 70 శాతం, ఫస్ట్ షోకు 75 శాతం, సెకండ్ షోకు 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో పెద్గగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్‌గా 35 నుంచి 40 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

Mark Antony Movie Day 3 official Collections Worlwide: Vishal movie mints decent revenue

మార్క్ ఆంటోని సినిమా మూడో రోజు భారీగానే వసూళ్లు రాబట్టమే కాకుండా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. తమిళ వెర్షన్‌లో 9.59 కోట్లు, తెలుగులో 85 లక్షల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడో రోజు 10.44 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

Mark Antony Movie Day 3 official Collections Worlwide: Vishal movie mints decent revenue

మార్క్ ఆంటోని సినిమా ప్రాంతాల వారీగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో మూడు రోజుల్లో 16.55 కోట్ల రూపాయలు, తెలంగాణలో 2.5 కోట్లు, కర్ణాటకలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3.55 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా దాదాపు 40 కోట్లకుపైగా కలెక్షన్లను నమోద చేసింది. ఈ సినిమా నాలుగో రోజు 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X