Mark Antony Day4 Collections బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న విశాల్ మార్క్ ఆంటోనీ.. 4రోజుల్లోనే 50కోట్ల క్లబ్‌లో
కోలీవుడ్ హీరో విశాల్ నటించిన తాజా గ్యాంగ్ స్టర్ డ్రామా మార్క్ అంటోనీ. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దకు సెప్టెంబర్ 15వ తేదీన వచ్చింది. ఇక విభిన్నమైన కంటెంట్, పిరియాడిక్, టైమ్ మిషన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా విశాల్ కెరీర్‌లో భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఎస్ జే సూర్య ఈ సినిమాలో విలన్ గా చేశారు. ఇక ఈ మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
విశాల్, ఎస్ జే సూర్య కాంబోలో వచ్చిన మూవీ మార్క్ ఆంటోనీ. ఇక ఈ చిత్రం విడుదల అయిన మొదటి రోజు నుంచి మంచి టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఎస్ వినోద్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. మార్క్ ఆంటోని చిత్రాన్ని 28 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని రేపడంతో బిజినెస్ కూడా భారీగా నమోదు చేసుకుంది.

విశాల్ మార్క్ ఆంటోని సినిమాను మొత్తంగా 2900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా సినిమా బాక్సాఫీస్ బరిలోకి వచ్చింది. తొలి రోజు ఇండియాలో 8.35 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగు వెర్షన్ 1.15 కోట్ల షేర్ వసూలు చేస్తే.. తమిళ వెర్షన్ 7.2 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగించింది. తమిళంలో 8.1 కోట్ల రూపాయలు, తెలుగులో 90 లక్షల షేర్ వసూలుచేసింది.

ఇక మూడో రోజు సైతం తమిళ వెర్షన్‌లో 9.59 కోట్లు, తెలుగులో 85 లక్షల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడో రోజు 10.44 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇక నాలుగో రోజు కలెక్షన్స్ వివరాలకు వస్తే... తమిళ వెర్షన్ 32.40 కోట్లు రాబట్టగా.. తెలుగు రాష్ట్రాల్లో 5.20కోట్లు వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని రూ.4.85 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ.9.60 కోట్లు రాబట్టింది. ఇక మొత్తంగా నాలుగు రోజుల్లో విశాల్ మార్క్ ఆంటోనీ రూ.52.05 కోట్ల గ్రాస్ రాబట్టగా... (రూ.25.50కోట్ల షేర్) రాబట్టింది.

మార్క్ ఆంటోని తమిళ వెర్షన్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోలు కాస్త తక్కువగానే ఆక్యుపెన్సీ కనిపించింది. మార్నింగ్ 26శాతం నమోదు కాగా... మ్యాట్నీకి 54.85శాతం, ఫస్ట్ షోకు 54.23 శాతం, సెకండ్ షోకు 52.50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో పెద్గగా మార్నింగ్ షో 15.89%, ఆఫ్టర్ నూన్ షో 27.87%, ఈవెనింగ్ షో26.16%, నైట్ షో28.25% ఆక్యూపెన్సీ నమోదైంది.


Click it and Unblock the Notifications











