Mark Antony Day5 Collections 5వరోజు తగ్గిన కలెక్షన్లు..తెలుగులో హిట్ కొట్టాలంటే ఇంకా ఎంత రాబట్టాలంటే?
కోలివుడ్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం మార్క్ అంథోని. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అయింది. తమిళంలో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుతుండగా... తెలుగులో కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇక మార్క్ ఆంటోనీ 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో రిపోర్ట్ ఒకసారి చూద్దాం.
విశాల్ మార్క్ ఆంటోని సినిమాను మొత్తంగా 2900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా సినిమా బాక్సాఫీస్ బరిలోకి వచ్చింది. తొలి రోజు ఇండియాలో 8.35 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగు వెర్షన్ 1.15 కోట్ల షేర్ వసూలు చేస్తే.. తమిళ వెర్షన్ 7.2 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగించింది. తమిళంలో 8.1 కోట్ల రూపాయలు, తెలుగులో 90 లక్షల షేర్ వసూలుచేసింది.

ఇక మూడో రోజు సైతం తమిళ వెర్షన్‌లో 9.59 కోట్లు, తెలుగులో 85 లక్షల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడో రోజు 10.44 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా 4వ రోజు తెలుగులో 1.4 కోట్ల గ్రాస్ ను అందుకోగా 5వ రోజు కలెక్షన్లు తగ్గాయి. దీనితో కేవలం రూ.60 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది. అందులో రూ.32 లక్షలు షేర్ ని అందుకుంది.
5 రోజుల్లో తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే... నైజం రూ.1.25 కోట్లు, సీడెడ్ రూ.0.40 కోట్లు, ఆంధ్రా రూ.1.37 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.3.02 కోట్ల షేర్ (రూ.5.95 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. మార్క్ ఆంటోనీ సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.50 కోట్లు కాగా ఇంకా 1.48 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది.

విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన మొత్తం కలెక్షన్స్ గమనిస్తే... తమిళనాడులో రూ. 34.20 కోట్లు రాబట్టగా... తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.95 కోట్లు వసూలు చేయగా... కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5.45 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో రూ.10.55 కోట్లు వసూలు చేసింది.
ఇక మార్క్ ఆంటోనీ ప్రపంచవ్యాప్తంగా రూ. 56.15 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... రూ.27.35 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం మీద ఈ సినిమా 5వ రోజు తెలుగులో కొంచె కలెక్షన్లు తగ్గినా.. తమిళ్ లో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











