Mark Day 2 Collections: కిచ్చా సుదీప్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. 2వ రోజు మార్క్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్క్. శాండల్‌వుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న మార్క్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కార్తీకేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న మార్క్ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కిచ్చా సుదీప్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు మార్క్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...
మార్క్ తారాగణం
సత్యజ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ మార్క్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో షైన్ టామ్ చాకో కీలకపాత్ర పోషించారు. దీప్‌శిఖ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. నవీన్ చంద్ర, విక్రాంత్, యోగిబాబు, గురు సోమసుందరమ్, నిశ్విక నాయుడు, రోషిణి ప్రకాష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాంతార ఫేమ్ అంజనీష్ బీ లోకనాథ్.. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ఆర్ గణేష్ బాబు ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు.

మార్క్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మార్క్ సినిమాకు 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు శాండల్‌వుడ్ వర్గాలు చెబుతున్నాయి. సుదీప్ క్రేజ్, టీజర్, ట్రైలర్లతో మార్క్ మూవీకి వరల్డ్ వైడ్‌గా మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. మార్క్ మూవీపై హైప్ నేపథ్యంలో ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 1000కు స్క్రీన్‌లలో విడుదల చేశారు.
మార్క్ తొలిరోజు కలెక్షన్
కిచ్చా సుదీప్ మూవీకి తొలిరోజు ఇండియాలో 6.28 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. కన్నడ వెర్షన్‌లో 6.25 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్‌లో 3 లక్షల రూపాయలు చొప్పున తొలిరోజు ఇండియాలో 6.28 కోట్ల రూపాయల నెట్.. 7.35 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
మార్క్ రెండో రోజు కలెక్షన్స్
కిచ్చా సుదీప్ స్థాయికి తగినట్లుగా ఓపెనింగ్స్ రాలేదని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఆయన నటించిన విక్రాంత్ రోణ చిత్రం తొలిరోజు అత్యధికంగా 35.35 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు మార్క్ ఎలాంటి వసూళ్లు రాబడతాడనేది ఉత్కంఠగా మారింది. రెండో రోజు సుదీప్ మూవీకి కన్నడ వెర్షన్‌లో 21.15 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. కడపటి సమాచారం అందేసరికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు మార్క్ చిత్రానికి ఇండియాలో 68 లక్షల రూపాయల నికర వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో రెండ్రోజుల్లో సుదీప్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











