Martin Collections: మార్టిన్ మూవీకి రికార్డు కలెక్షన్లు.. ధృవ్ సర్జా కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. ఎన్ని కోట్లంటే?

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కథా అందించగా యువ హీరో అర్జున్ సర్జా నటించిన తాజా చిత్రం మార్టిన్. వాసవి ఎంటర్‌ప్రైజెస్, ఉదయ్ కే మెహతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఉదయ్ కే మెహతా నిర్మించిన ఈ సినిమాకు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య, అన్వేషి జైన్, సుకృతా వాగ్లే తదితరులు నటించిన ఈ సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

మార్టిన్ సినిమాకు సంబంధించి.. ఈ చిత్రంలో పెద్దగా టాప్ యాక్టర్లకు స్కోప్ లేకపోయింది. కథంతా ధృవ్ సర్జాపై ఉండటంతో సహ నటులంతా కొత్తవారే కనిపించారు. అయితే టెక్నికల్‌గా ఈ సినిమాకు మణిశర్మ, రవి బస్రూర్ లాంటి గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేశారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం భారీగా జరిగింది. ఈ సినిమాను సుమారుగా 50 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Martin Day 1 Expected Box Office Collections Worldwide

మార్టిన్ సినిమాకు భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. చెన్నై, హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 40 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో సుమారుగా 1000కిపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

మార్టిన్ సినిమాకు కన్నడలో భారీ ఆదరణ లభించింది. మార్నింగ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 70 శాతం, ఫస్ట్ షోకు 75 శాతం, సెకండ్ షోకు 80 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. బెంగళూరులో 70 శాతం, మైసూరులో 75 శాతం, శివమొగ, తమ్కురు, ఇతర ప్రాంతాల్లో 40 నుంచి 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ధృవ్ సర్జా మూవీకి తెలుగులో ఫర్వాలేదనే ఆక్యుపెన్సీ కనిపించగా.. తమిళం, మలయాళం, హిందీలో ఆక్యుపెన్సీ పేలవంగా నమోదైంది. హైదరాబాద్, వైజాగ్, ముంబై, చెన్నై, కోచి ప్రాంతాల్లో ఓ మోస్తారు ఆక్యుపెన్సీ కనిపించింది.

ఇక మార్టిన్ సినిమాకు కన్నడలోనే భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా కర్ణాటకలోనే సుమారుగా 4 కోట్లకుపైగా నికర వసూళ్లు, 8 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ీ సినిమా తొలి రోజు 6 కోట్ల నికరంగా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

More from Filmibeat

Read more about: martin box office dhruv sarja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X