Martin 3 Days Report:ధృవ్ సర్జాకు షాకింగ్ కలెక్షన్లు..ట్రోల్స్ ఎదురించిన మార్టిన్‌‌..ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్టిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తున్నది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రాసిన కథ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అయినా ఈ సినిమాకు తొలి మూడు రోజులు కన్నడ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత? గత 3 రోజుల్లో రాబట్టిన కలెక్షన్లు ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత వసూలు చేయాలనే వివరాల్లోకి వెళితే..

దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీని ఉదయ్ కే మెహతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఉదయ్ కే మెహతా నిర్మించగా, ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వైభవి శాండిల్య, అన్వేషి జైన్, సుకృతా వాగ్లే తదితరులు నటించారు. ఈ సినిమాను సుమారుగా 50 కోట్ల రూపాయలతో నిర్మించారని తెలిసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 40 కోట్లుగా నిర్ణయించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Martin Day 3 Box Office Collections Worldwide Dhruv Sarja s stable and strong at GBOC

మార్టిన్ సినిమా టీజర్, ట్రైలర్స్, ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచడంతో ఈ మూవీని ధృవ్ సర్జా కెరీర్‌లోనే అత్యధికంగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేయగా.. అందులో కన్నడలోనే అత్యధికంగా విడుదల చేయడం గమనార్హం. అయితే తొలి రోజు ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ కనిపించింది.

ఇక మార్టిన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కన్నడలో 7.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో 50 లక్షలు, తమిళంలో 10 లక్షలు, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు, హిందీలో 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 10 కోట్ల రూపాయలు రాబట్టింది.

ట్రోల్స్, నెగిటివ్ టాక్‌లోను ఈ చిత్రం రెండో రోజు నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. 2వ రోజు కర్ణాటకలో 6 కోట్ల రూపాయల గ్రాస్, తెలుగులో 30 లక్షలు, మిగితా ప్రాంతాల్లో 50 లక్షలు కలిపి మొత్తంగా 6.8 కోట్లు వసూల చేసింది. ఈ సినిమా 3వ రోజు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నప్పటీకి.. సెలవు దినాలను క్యాష్ చేసుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ సినిమా 3వ రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

గత 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 10 కోట్ల గ్రాస్, రెండో రోజు 7 కోట్లు, మూడో రోజు 5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ మూవీ 3 రోజుల్లో 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ రేంజ్‌లో వసూళ్లు రాబడితే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా రానున్న రోజుల్లో కలెక్షన్ల వేగం పెంచుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: martin box office dhruv sarja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X