Martin Collections: 100 కోట్ల బడ్జెట్.. 60 కోట్ల టార్గెట్.. మార్టిన్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా నటించిన భారీ బడ్జెట్ చిత్రం మార్టిన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పేలవంగా కలెక్షన్లు సాధిస్తున్నది. భారీ అంచనాలతో వచ్చిన యాక్షన్, ఎంటర్‌టైనర్ మూవీ అంచనాలను అందుకోలేక తడబాటుకు గురి అవుతున్నది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ధృవ్ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు ఊహించినంత రేంజ్‌లో రాబట్టలేకపోతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇండియాలో ప్రధాన భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ ప్లాన్ చేయడంతో భారీ బడ్జెట్ అయింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి ఈ సినిమా నిర్మాణ వ్యయం 100 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శాటిలైట్, ఓటీటీ బిజినెస్ తర్వాత ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జర్నీని ప్రారంభించింది.

మార్టిన్ ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్, అర్జున్, ధృవ్ దేశవ్యాప్తంగా చేసిన ప్రచారానాకి మంచి స్పందన రావడంతో ఈ సినిమా భారీగా దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయితే రిలీజ్‌కు ముందు బజ్ క్రియేట్ కావడంతో సుమారుగా ఇండియాలోనే ఈ మూవీని 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అత్యధికంగా ఈ మూవీని కన్నడలోనే విడుదల చేయడం గమనార్హం.
మార్టిన్ చిత్రం తొలి మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోనే భారీగా వసూళ్లను రాబట్టింది. మిగితా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కన్నడలో 15 కోట్ల రూపాయలు, ఏపీ, తెలంగాణలో 1.25 కోట్లు, తమిళనాడులో 20 లక్షలు, హిందీలో 90 లక్షలు, మలయాళంలో 10 లక్షల రూాపయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 17 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.
ఇక ప్రతీ సినిమాకు కఠినమైన పరీక్షగా మారే తొలి సోమవారం భారీగా వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ.. కన్నడలో నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. కన్నడలో 4వ రోజు 2 కోట్ల రూపాయలు, ఆంధ్రా, నైజాం, ఇతర ప్రాంతాల్లో కలిపి 75 లక్షలు వసూలు చేసింది. ఈ దాంతో 4వ రోజు 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
మార్టిన్ చిత్రం ముందు భారీ లక్ష్యం కనిపిస్తున్నది. ఈ సినిమా ఇదే రకంగా వసూళ్లను సాధిస్తే.. బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగా కనిపిస్తున్నది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్పా ఈ సినిమా లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











