Martin Box Office Report: షాకింగ్‌గా మార్టిన్ కలెక్షన్లు.. ధృవ సర్జా మూవీ నస్టాల నుంచి బయటపడాలంటే?
కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, యువ హీరోయిన్లు వైభవి శాండిల్య, అన్వేషి జైన్, సుక్రుత వాగ్లే, అచ్యుత్ కుమార్ నటించిన మూవీ మార్టిన్. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అందించిన కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కేవీఎన్ బ్యానర్, ఉదయ్ కే మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉదయ్ కే మెహతా నిర్మించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం గత వారం రోజులుగా ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
కన్నడ సినిమా పరిశ్రమలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ మూవీని పలు దేశాల్లో అత్యంత లావీష్‌గా చిత్రీకరించారు. దాంతో ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల వ్యయంతో నిర్మించారు.

మార్టిన్‌ను సినిమాను కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ వ్యాల్యూను 50 కోట్లుగా నిర్ణయించారు. ధాంతో ఈ సినిమా 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. అయితే తొలి రోజు భారీగానే కలెక్షన్లు పాన్ ఇండియా వైడ్‌గా రాబట్టింది.
మార్టిన్ చిత్రం తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. అయితే టాక్ నెగిటివ్‌గా మారడంతో రెండో రోజు నుంచి వసూళ్లు అనుకొన్నంత రాబట్టలేకపోయింది. తొలి రోజు 9 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 6.5 కోట్ల గ్రాస్, మూడో రోజు 4.5 కోట్ల గ్రాస్, 4వ రోజు 2 కోట్ల గ్రాస్, 5వ రోజు 1.5 కోట్ల గ్రాస్, 6వ రోజు 1 కోటి గ్రాస్, 7వ రోజు 1 కోటి రూపాయల గ్రాస్, 8వ రోజు 1 కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. తొలివారం ఈ మూవీ 27.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక భాషల వారీగా, ప్రాంతాల వారీగా ఈ సినిమా కలెక్షన్లు పరిశీలిస్తే.. అత్యధికంగా కన్నడలో 16 కోట్ల రూపాయలు, హిందీలో 1.25 కోట్లు, తమిళంలో 25 లక్షలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 20 కోట్ల నెట్, 27.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మార్టిన్ తొలివారం కలెక్షన్ల పరిస్థితి చూస్తే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు దూరంగా ఉందనే విషయం స్పష్టమవుతున్నది. వారాంతంలో పుంజుకొని అదే జోష్‌ను కొనసాగిస్తూ.. ఈ సినిమా నష్టాలను పూడ్చుకొనే అవకాశం ఉంది. లేకపోతే భారీ నష్టాల్లో ముగిసే ఛాన్స్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











