Maruthi Nagar Subramanyam Collections: మారుతి నగర్ సుబ్రమణ్యంకు ఊహించని కలెక్షన్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రానికి బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ వంటి వారు నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
మధ్య తరగతి కుటుంబంలో ఉండే సాధక బాధకాలను నేపథ్యంగా ఎలాంటి వల్గర్ హాస్యానికి చోటు ఇవ్వకుండా సున్నితమైన ఫన్‌తో ఈ సినిమాను లక్ష్మణ్ కార్య రూపొందించారు. ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచే కాకుండా సాధారణ ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. మానవ సంబంధాలు, వినోదం, ఎమోషన్స్ రూపొందించిన ఈ చిత్రాన్ని సుమారుగా 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా రిలీజ్‌కు ముందే ప్రమోషనల్ కార్యక్రమాల వల్ల మంచి బజ్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ దర్శకుడు తబితా సుకుమార్ ఇంప్రెస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులందరి వద్దకు తీసుకెళ్లేందుకు చొరవ తీసుకొని ఈ మూవీని ప్రజెంట్ చేయాలని అనుకొన్నారు. దాంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.
ఇక మారుతి నగర్ సినిమాకు మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ అందుకొన్నది. ఈ సినిమాకు తొలి రోజు 70 లక్షల గ్రాస్ లభించింది. రెండో రోజు మౌత్ టాక్ ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు 83 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 2 రోజుల్లో 1.53 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక మూవీకి 3వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సానుకూల స్పందన లభిస్తున్నది. రెండు రోజుల కంటే ఈ చిత్రం ఎక్కువగా కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే జోష్ కొనసాగితే తొలివారంలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











