అల్లు శిరీష్ 'కొత్త జంట' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రాన్ని వాలెంటైన్స్ డే (పిభ్రవరి 14) న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది.
'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్‌స్టాప్', 'ప్రేమ కథాచిత్రమ్' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి.

కొత్త జంట గురించి చెప్తూ....ఇప్పుడు నేను చేస్తున్న 'కొత్త జంట' చాలా క్లీన్ ఫిల్మ్. ధూమపానం, మద్యపానానికి సంబంధించిన చిన్న సన్నివేశమే కాదు, కనీసం వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా సినిమాలో కనిపించవు. కానీ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా. ఆగస్ట్ 2న షూటింగ్ ప్రారంభించాం. గీతా ఆర్ట్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఎవరం మొనగాళ్లం కాదు. మనలో ప్లస్‌లతో పాటు మైనస్‌లూ ఉంటాయి అన్నారు.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. మూస కథలు కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనుకున్న శిరీష్‌కు ఈ సినిమా సరికొత్తగా ఉంటుందని, అతనికి కథ చెప్పగానే పాత్రలోకి ఇన్వాల్వ్ అయ్యాడని, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమని మారుతి తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.


Click it and Unblock the Notifications











