మారుతి.. 'ప్రేమకథా చిత్రమ్' పరిస్థితి ఏమిటి?
హైదరబాద్ : ఈ రో జుల్లో, బస్‌స్టాప్ సక్సెస్‌ల తర్వాత మారు తి స్వీయ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిం చిన చిత్రం 'ప్రేమకథా చిత్రమ్'. సుధీర్‌బా బు-నందిత హీరో,హీరోయిన్స్ గా ఆర్.పి.ఏ క్రియేష న్స్-మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిం చాయి. సుదర్శ నరెడ్డి నిర్మాత. ఈరోజు ల్లో' ఛాయాగ్రాహకుడు జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించారు.
ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రం ఓపినింగ్స్ పెద్దగా లేకున్నా టాక్ బాగా వచ్చింది. చిత్రంలో మంచి కామెడీ ఉందని మౌత్ టాక్ స్ప్రెడ్ కావటంతో థియోటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది.

అలాగే మారుతి బ్రాండ్ ఇమేజ్ సినిమాకు బాగా కలిసి వచ్చింది. అయితే సుధీర్ బాబు నటనకు మాత్రం మైనస్ అంటున్నారు. ఏ ఎమోషన్ కి అయినా ఒకే విధమైన ఎక్సప్రెషన్ పెట్టడం జరిగింది. హీరోయిన్ నందిత మాత్రం సినిమాని నిలబెట్టింది.
ఇక ఈ చిత్రంలో ప్రేమలో ఓడిపోయి చావే శరణ్యం అనుకొంది ఓ జంట. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అనుకోని పరిస్థితుల్లో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు. ఆ పరిస్థితులు ఏమిటి? ఆ తరవాత ఏం జరిగిందీ అనేదే కథ. నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది.
మారుతి మాట్లాడుతూ-''ఫన్, ఫియర్, రొమాన్స్ అన్నిటినీ రంగరించి అందంగా ముస్తాబు చేసిన చిత్రమిది. సుధీర్ ఓ హీరో లా కాకుండా నటుడిలా కనిపిస్తారు. నందిత నటనాభి నయం హైలైట్. కేవలం నాలుగు పాత్రలతో సినిమా రూపొందించాం. వినోదంతోపాటు ఉలిక్కిపడేలా కథలో మలుపులు ఉంటాయి. జె.బి. స్వరపరచిన గీతాలు అందరికీ నచ్చుతున్నాయి'' అన్నారు.


Click it and Unblock the Notifications











