Masooda Day 1 collections.. మసూదకు భారీ ఆదరణ.. తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంతంటే?
టాలీవుడ్‌లో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకొన్న రాహుల్ యాదవ్ నక్క తాజాగా రూపొందించిన చిత్రం మసూద. ముస్లిం కథా నేపథ్యంతో విభిన్నంగా రూపొందిన సస్పెన్, హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్‌తోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రశంసలు లభించాయి. ఈ సినిమా తొలి రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..

మసూదతో హ్యాట్రిక్
స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్క ఇప్పటి వరకు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. కంటెంట్‌ను సాంకేతిక విలువలను బలంగా నమ్మే ఆయన తాజాగా మసూదతో హ్యాట్రిక్ సాధించారు. మసూద సినిమాకు సంబంధించిన నిర్మాణ విలువల గురించి సినీ వర్గాలే కాకుండా, ప్రేక్షకుల కూడా ప్రశంసలు గుప్పిస్తున్నారు.

మసూద ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఇక మసూద ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. సంగీత, తిరువీర్ ఫెర్ఫార్మెన్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. దాంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకొన్నారు.

మసూద అక్యుపెన్సీ ఎంతంటే?
ఇక మసూద తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ నోట్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమాకు నైజాం, ఆంధ్రాలోని మల్టీప్లెక్స్‌లోనే కాకుండా బీ, సీ సెంటర్లలో రెస్పాన్స్ లభిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 30 శాతానికిపైగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

మసూద తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
ఇక మసూద చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫలితాలను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. నైజాం, ఆంధ్రాలో 50 లక్షల షేర్‌ను, 1 కోటి గ్రాస్ వసూళ్లను సాధించింది. వారాంతంలో మౌత్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
ఇక మసూద మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 2.5 కోట్లుగా వ్యాల్యూ చేశారు. ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద కనీసం 2.75 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఈ చిత్రం ఏ రేంజ్ లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











