twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Masooda day 4 collections క్లీన్ హిట్ టాక్‌.. లాభాల్లోకి మసూద.. 4 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?

    |

    విభిన్నమైన కంటెంట్, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ చిత్రం మసూద. మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్లతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకొన్న రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్‌పై రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సినీ విమర్శకులు, అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి. మూడు రోజుల్లో సానుకూలమైన వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 4వ రోజు ఎలాంటి వసూళ్లు సాధించిందంటే?

     3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో

    3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో

    మసూద సినిమా తొలి ఆట నుంచి మంచి రేటింగ్, టాక్ సాధించింది. దాంతో తొలి రోజు 75 లక్షలు, రెండో రోజు 92 లక్షలు, మూడో రోజు 1.48 కోట్లు సాధించింది. దాంతో మూడు రోజుల్లో 3.15 కోట్ల వసూళ్ల సాధించింది. దాంతో మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఓ రికార్డుగా పేర్కొన్న వచ్చు.

    నాలుగో రోజున ఆక్యుపెన్సీతో

    నాలుగో రోజున ఆక్యుపెన్సీతో

    ఇక నాలుగో రోజు బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా కలెక్షన్లు రాబట్టింది. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సగటున 25 శాతాని కంటే ఎక్కువగా ఆక్యుపెన్సీ నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    నైజాం, ఆంధ్రాలో 4వ రోజు

    నైజాం, ఆంధ్రాలో 4వ రోజు

    మసూద నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో 20 లక్షలు, సీడెడ్‌లో 10 లక్షలు, ఆంధ్రాలో 30 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో మొత్తం 3.75 కోట్ల గ్రాస్, 2 కోట్ల షేర్ వసూలు చేసింది.

     తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్లు

    గత నాలుగు రోజుల్లో మసూద నైజాం, ఆంధ్రాలో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 1.7 కోట్లు, సీడెడ్‌లో 40 లక్షలు, ఆంధ్రాలో 1.65 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 3.75 కోట్ల గ్రాస్, 2 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

    మసూద లాభం ఎంతంటే

    మసూద లాభం ఎంతంటే

    మసూద సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. 1.75 కోట్ల మేర వ్యాల్యూగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం తక్కువగా ఉంచారు. ఈ సినిమా మూడో రోజునే 2 కోట్లు రాబట్టడం ద్వారా లాభాల్లోకి ప్రవేశించింది. ఇంకా ఈ చిత్రం రానున్న రోజుల్లో ఏ మేరకు బాక్సాఫీస్‌ను ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Thiruveer and Sangeetha's Masooda released on November 18th. Here is the day 4 collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X