Don't Miss!
- News
Budget 2023 highlights: ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలు- కొత్తగా ప్రవేశపెట్టినవి ఇవే..!!
- Finance
Gold Price Today: జీవితకాల గరిష్ఠానికి బంగారం.. బడ్జెట్ పరుగులు.. కొనాలా..? మానాలా..?
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- Technology
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Masooda Collections: మసూదకు ఊహించని వసూళ్లు.. 6 రోజుల్లోనే అన్ని కోట్లు.. లాభాలతో రికార్డు
మిగిలిన అన్ని జోనర్ల కంటే హర్రర్ థ్రిల్లర్ మూవీలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తూ ఉంటుంది. అందుకే ఈ తరహా సినిమాలు పదుల సంఖ్యలో వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన చాలా చిత్రాలు ఘన విజయాలను అందుకోవడంతో ఫిల్మ్ మేకర్లు మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'మసూద'. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ఈ మూవీకి తెలుగులో వసూళ్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఇది లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో 'మసూద' 6 రోజుల రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

మసూదగా అంటూ వచ్చారు
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'మసూద'. సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ మూవీలో తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందించారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, శ్రీధర్, సత్యం రాజేష్ కీలక పాత్రలు చేశారు.
జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష: హాట్ షోలో గీత దాటేసి మరీ రచ్చ

మసూద బిజినెస్ వివరాలు
గతంలో మాదిరిగా కాకుండా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ నమ్మకంతోనే 'మసూద' మూవీ థియేట్రికల్ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల రైట్స్‌ను కలిపి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 1.30 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే రిలీజ్ చేశారు.

6వ రోజు ఎంత వచ్చింది?
క్రేజీ కాంబోలో వచ్చిన 'మసూద' మూవీని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే దీనికి మొదటి రోజు రూ. 75 లక్షలు గ్రాస్, రెండో రోజు రూ. 92 లక్షలు గ్రాస్, మూడో రోజు రూ. 1.48 కోట్లు గ్రాస్, నాలుగో రోజు రూ. 60 లక్షలు గ్రాస్, ఐదో రోజు రూ. 51 లక్షలు గ్రాస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆరో రోజు దీనికి రూ. 42 లక్షలు గ్రాస్, రూ. 20 లక్షలు పైగా షేర్ వచ్చింది.
బీచ్‌లో అందాల తెర తీసేసిన శ్రీముఖి: అక్కడ ఆకును అడ్డుగా పెట్టి మరీ!

6 రోజులకు ఎంతొచ్చింది?
'మసూద' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో బాగానే రాబట్టింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 2.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 49 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.89 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 6 రోజుల్లో రూ. 4.68 కోట్లు గ్రాస్, రూ. 2.48 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
ఆరు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 4.68 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'మసూద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ కొంతమేర ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 34 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 5.02 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.65 కోట్లు షేర్‌ను వచ్చింది.
నాగశౌర్య కట్నం వివరాలు లీక్: అన్ని కోట్ల విలువైన కానుకలు.. అనూష పేరిట ఉన్న ఆస్తి ఎంతంటే!

లాభాల బాటలో నడుస్తోంది
హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'మసూద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లో రూ. 2.65 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.15 కోట్లు లాభాలు కూడా దక్కాయి.