Mass Jathara Day 5 Collections: మాస్ జాతర షాకింగ్ కలెక్షన్స్.. రవితేజ మూవీ 5వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

Mass Jathara Collections: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ తన ఎనర్జీ, టైమింగ్, మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించే హీరో. కానీ గత కొంతకాలంగా ఆయన కెరీర్‌లో కాస్త క్లిష్ట దశ కొనసాగుతోంది. ఒకప్పుడు హిట్ మెషీన్‌గా గుర్తింపు పొందిన రవితేజకు వరుసగా వాల్తేర్ వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలతో ఫెల్యూర్స్ అందుకుంటున్నారు. ఇలా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన మాస్ ఇమేజ్ కొంచెం డల్ అయింది. ఈ నేపథ్యంలో రవితేజ మళ్లీ తన మాస్ ఇమేజ్ ను తిరిగి తెచ్చుకోవడానికి 'మాస్ జాతర' అనే ప్యూర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో మాస్ జాతరకు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 5వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

"మాస్ జాతర" రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావడం ప్రత్యేక ఆకర్షణ. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ వంటి ప్రముఖ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రంపై దాదాపు రూ.90 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ మేళవింపుతో మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసింది. ఇప్పటికే రచయితగా ప్రేమకథా చిట్ట్రమ్, కృష్ణార్జున యుద్ధం వంటి హిట్స్ ఇచ్చిన భోగవరపు, దర్శకుడిగా ఈ సినిమాతో తన ప్రతిభను నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Mass Jathara Day 5 Expected Box Office Collections Ravi Teja-Sree Leela Film Collection Rs 1 Crores Worldwide

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకి పెద్ద హైలైట్‌గా మారింది. రవితేజ మాస్ ఎనర్జీకి శ్రీలీల గ్లామర్ కలవడంతో స్క్రీన్‌పై విజువల్ ఫన్ కనిపించింది. సపోర్టింగ్ రోల్స్‌లో నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, హైపర్ ఆది, హిమజ, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అయ్యన్న, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. ముఖ్యంగా భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రవితేజ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. టైటిల్ సాంగ్, ఇంట్రో సాంగ్‌లు థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టించాయి.

బాక్సాఫీస్ బిజినెస్ పరంగా చూస్తే మాస్ జాతర సినిమా సుమారు రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్ల థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ రూ. 3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ రూ. 2 కోట్లు దాకా అమ్ముడయ్యాయి. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్ షేర్ కనీసం రూ. 32 కోట్లు, గ్రాస్ కలెక్షన్ రూ. 65 కోట్లకు పైగా రావాలి. సినిమా అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్ షోలతో ప్రారంభమైంది. ఫస్ట్ షో నుంచే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా, ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లారు. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ ఎనర్జీ, కామెడీ సీక్వెన్స్‌లు, శ్రీలీల గ్లామర్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. అయితే సెకండ్ హాఫ్‌లో కథ కొంత సీరియస్ మోడ్‌లోకి వెళ్లడంతో మాస్ ఆడియెన్స్ కొంత నిరుత్సాహానికి గురయ్యారనే కామెంట్స్ వచ్చాయి.

షాకింగ్ కలెక్షన్స్
మాస్ జాతర కు ప్రీమియర్ షోల నుంచే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాక్నిల్క్ నివేదికల ప్రకారం ప్రీమియర్ షోల ద్వారా సినిమా రూ.2.9 కోట్లు నెట్ వసూలు చేసింది. నిర్మాతల ప్రకారం గ్రాస్ కలెక్షన్స్ రూ. 5 కోట్ల వరకు చేరాయి. మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ. 4.2 కోట్లు, రెండవ రోజు రూ. 3.15 కోట్లు, మూడవ రోజు రూ. 1.16 కోట్లు, నాలుగో రోజు రూ. 1.04 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. మొత్తం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 13 కోట్ల నెట్ వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఐదో రోజు కలెక్షన్లు మాత్రం కొంత తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం షోలు 12.7 శాతం, మధ్యాహ్నం షోలు 16.5 శాతం ఆక్యుపెన్సీతో సాగాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఐదో రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ.1 కోటి నుండి రూ. 1.2 కోట్ల మధ్య ఉండవచ్చని, వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు ₹2 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నారు. దాంతో మొత్తం మాస్ జాతర ఐదు రోజుల నేషనల్ నెట్ కలెక్షన్ రూ.14 కోట్లకు చేరగా, వరల్డ్ వైడ్ వసూల్లు రూ. 20 కోట్ల మార్క్ దిశగా పయనిస్తున్నాయి.

సినిమాకు మౌత్ టాక్ మిశ్రమంగానే ఉన్నా, రవితేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌, శ్రీలీల గ్లామర్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఫ్యాన్స్‌ను బాగా కనెక్ట్ చేశాయి. ట్రేడ్ సర్కిల్స్ అంచనా ప్రకారం, ఈ వారం మొత్తం సాలిడ్ కలెక్షన్లు అందుకుంటే.. రెండో వారం చివరి నాటికి బ్రేక్ ఈవెన్ చేరే అవకాశం ఉంది. అయితే.. మాస్ జాతర సినిమాతో రవితేజ కెరీర్ లో హిట్ అందుకున్నారా? లేదా? అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X