Mass Jathara Worldwide Business: రవితేజ‌ మూవీకి రికార్డ్ బిజినెస్.. మాస్ జాతర‌కు ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి

మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన చిత్రం మాస్ జాతర. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆయన ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. 2023లో వాల్తేర్ వీరయ్య హిట్ తర్వాత రవితేజ చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. అక్టోబర్ 31న విడుదల కానున్న మాస్ జాతరకు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ వివరాలు పరిశీలిస్తే..

రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు మాస్ జాతర సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషం. మాస్ జాతరకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు.

Mass Jathara Movie Pre Release Business Worldwide Ravi Teja s Movie Budget Theatrical Business Break Even Target Details

మాస్ జాతర బడ్జెట్ ఎంత?
హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు అందమైన లోకేషన్స్‌లో మాస్ జాతర సినిమా షూటింగ్ జరుపుకుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్యలు ఖర్చు చేశారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మాస్ జాతర చిత్రానికి దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. రవితేజ, శ్రీలీల లుక్స్‌తో పాటు టీజర్, ట్రైలర్ల కారణంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మాస్ జాతర ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
మాస్ జాతర ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. వరుసగా నాలుగు డిజాస్టర్స్ ఉన్నప్పటికీ రవితేజ సినిమాకు బాగానే బిజినెస్ జరిగినట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌పరంగా మాస్ జాతర భారీ మొత్తం రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతర బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం ఏరియాలో 10 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.50 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 11.50 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఆంధ్రా, నైజాంలలో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 26 కోట్ల రూపాయల షేర్.. 52 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

మాస్ జాతర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇక తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే.. మాస్ జాతరకు కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా మాస్ జాతర 30 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ సినిమా ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల రూపాయల షేర్.. 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మాస్, యాక్షన్, మసాలా, కామెడీ ఎలిమెంట్స్‌తో నింపేసిన మాస్ జాతర చిత్రం ఈ లక్ష్యాన్ని ఈజీగానే కొడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X