Tiger Nageswara Rao Collections: రూ.38.50 కోట్ల సినిమా.. 15 రోజుల్లో వచ్చిందంతే.. నిర్మాలకు భారీ నష్టాలు!

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఇక ఈ చిత్రంపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాదు.. ఇది మొదటి పాన్ ఇండియా చిత్రం. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయింది. ఇక మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా తాజాగా విడుదల అయి క15 రోజులు పూర్తి చేసుకుంది. మరి 15 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. నూతన దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. మొదటి సారిగా రేణు దేశాయి కీలక పాత్రలో నటించింది. ఇక ఈ మూవీలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Mass Maharaj Ravi Teja Tiger Nageswara Rao Movie 15 Days Worldwide Collections

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా మూవీ టైగర్ నాగేశ్వరరావు. సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టింది. ఇక కొత్త సినిమాల రిలీజ్ కారణంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా థియేటర్స్ చాలా వరకు తగ్గిపోయాయి. దానికి తోడూ కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో ఆ సినిమాల ఇంపాక్ట్ కూడా పడటంతో సినిమా కలెక్షన్స్ పరంగా మరింత ఈ సినిమా స్లో అయింది.

బాక్సాఫీస్ వద్ద రవి తేజ టైగర్ నాగేశ్వర రావు 15 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ రిపోర్ట్ గమనిస్తే.. నైజాం రూ.7.57 కోట్లు, సీడెడ్ రూ.3.88 కోట్లు, ఉత్తర ఆంధ్ర రూ.2.54 కోట్లు, తూర్పు రూ. 1.54 కోట్లు, పశ్చిమ రూ.1.00 కోట్లు, గుంటూరు రూ.2.00 కోట్లు, కృష్ణ రూ.1.31 కోట్లు, నెల్లూరు రూ.84 లక్షలు వసూలు చేసింది.

Mass Maharaj Ravi Teja Tiger Nageswara Rao Movie 15 Days Worldwide Collections

ఇక తెలుగాణ, ఏపీ రాష్ట్రాలు కలిపి టైగర్ నాగేశ్వరరావు చిత్రం... రూ.20.68 కోట్లు షేర్... రూ.35.80 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని రూ.2.16 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో రూ.1.95 కోట్లు రాబట్టగా.. ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా.. రూ.24.79 కోట్లు షేర్ (రూ.46.30 కోట్లు~ గ్రాస్) వసూలు చేసింది.

Mass Maharaj Ravi Teja Tiger Nageswara Rao Movie 15 Days Worldwide Collections

రవితేజ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 13.71 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సినిమా ఇక బాక్సాఫీస్ వద్ద వసూల్లు చేసే స్థితిలో లేదు. కొత్త చిత్రాలు వచ్చాయి.. ఇక నిర్మాతలకు నష్టాలు తప్పేలా లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X