Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
నిజంగా ఈ ఏడాది సంక్రాంతిని ఎవరు మర్చిపోయిన కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం పెద్దగా ఎవరు మర్చిపోలేరని చెప్పవచ్చు. సంక్రాంతికి కరెక్ట్ సినిమా వస్తే కలెక్షన్స్ ఏ స్థాయిలో పెరుగుతాయో మరోసారి ఋజువయ్యింది. పాజిటివ్ టాక్ వస్తే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గవని అర్ధమయ్యింది. క్రాక్, మాస్టర్ సినిమాలు రెండు ఇండస్ట్రీలకు ఒక మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇక ఆ సినిమా తెలుగు కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
Recommended Video
అసలు పరీక్ష అప్పుడే మొదలైంది
సంక్రాంతి హాలిడేస్ ముగిశాయి. ఇక సోమవారం నుంచే సినిమాలకు అసలు పరీక్ష మొదలైంది. ఆదివారం వరకు బాగానే ఉన్న కలెక్షన్స్ ఒక్కసారిగా సోమవారం నుంచి తగ్గుతూ వచ్చాయి. అయితే క్రాక్ సినిమా కలెక్షన్స్ మాత్రం పెద్దగా తగ్గలేవు. ఆ సినిమా గత 5రోజుల నుంచి కూడా పాజిటివ్ గానే ముందుకు సాగుతోంది.
10రోజుల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్
10రోజులైనా కూడా క్రాక్ కలెక్షన్స్ కోటికి తగ్గలేదు. ఇక క్రాక్ తరువాత వచ్చిన రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలకు సోమవారం నుంచి లక్షల్లోనే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ రవితేజ సినిమా మాత్రం కోటికి పైగా షేర్స్ అందుకుంటూ ఫ్లోలో ను కొనసాగిస్తోంది. ఒక విధంగా టాలీవుడ్ కు క్రాక్ మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి. 10రోజుల్లో సినిమాకు వచ్చిన మొత్తం షేర్స్ 23.38కోట్లు. ప్రస్తుతం 10కోట్లకు పైగా కలెక్షన్స్ తో సినిమా ప్రాఫిట్ జోన్ లో కొనసాగుతోంది.
మాస్టర్ పరిస్థితి ఎలా ఉందంటే..
ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ విషయానికి వస్తే.. మొదటి వారం పూర్తయ్యే సరికి సినిమా తమిళనాడులో 85% రికవరీ అయ్యింది. ఓవర్సీస్ లో కూడా 90% కలెక్షన్స్ వెనక్కీ వచ్చేశాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో అలాగే కర్ణాటక, కేరళలోని సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. విజయ్ అసలు మార్కెట్ ఏమిటో ఈ సినిమాతో క్లారిటీ వచ్చేసింది.
ఆ పని ఎప్పుడో పూర్తి చేసిన విజయ్
మాస్టర్ సినిమాకు ఇంకాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ అయితే మరో రేంజ్ లో ఉండేవి. సొంత బాషతోనే కాకుండా పరబాషలో కూడా ఈ హీరో మార్కెట్ పేరిగినట్లు అర్ధమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పని ఎప్పుడో పూర్తి చేసిన మాస్టర్ 7వ రోజు తెలుగులో 54లక్షలను మాత్రమే అందుకుంది. మొత్తంగా ఇప్పటివరకు ఏపీ తెలంగాణలో 13.03కోట్లు వచ్చాయి. అంటే దాదాపు 4.53కోట్ల వరకు ప్రాఫిట్స్ అందుకున్నట్లు సమాచారం.