Mastiii 4 Closing Collections: మస్తి 4 క్లోజింగ్ కలెక్షన్స్.. రితేశ్ దేశ్‌ముఖ్ మూవీకి భారీ నష్టాలు, ఎంతంటే?
హిందీ చిత్ర పరిశ్రమలో హిట్ ఫ్రాంచైజీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న మస్తీ నుంచి వచ్చిన మరో అడల్ట్ కామెడీ మూవీ మస్తీ 4. ఈ సినిమాకు మిలాప్ మిలన్ ఝవేరి దర్శకత్వం వహించారు. సినీ 1 స్టూడియోస్, వేవ్ బాండ్ ప్రొడక్షన్స్, మారుతి ఇంటర్నేషనల్, ఎం ఫోర్ ఫిలింస్, బర్కిలీ మీడియా గ్రూప్ బ్యానర్‌లపై అశోక్ తకారియా, ఎస్‌కే అహ్లూవాలియా, ఏ ఝుంజన్‌వాలా, భూషణ్ కుమార్, ఇంద్ర కుమార్, కృషన్ కుమార్, యూ ఫై సూయన్‌లు సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్ శివ్‌దాసాని, జెనీలియా దేశ్‌ముఖ్, ఎల్నాజ్ నౌరౌజీ, నర్గీస్ ఫక్రీ, అర్షద్ వార్సి, నటాలియా జోంజెక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషంచారు. సంకేత్ షా సినిమాటోగ్రాఫర్‌గా, సంజయ్ సంక్లా ఎడిటర్‌గా సేవలందించారు. సంజీవ్ దర్శన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నవంబర్ 21న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మస్తీ 4 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? పరిశీలిస్తే..

మస్తీ 4 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ ఖర్చులతో ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలు వ్యయం కాగా.. ప్రింట్స్, అడ్వర్టైజింగ్ కోసం మరో 10 కోట్లు ఖర్చు అయ్యంది. దాంతో మస్తీ 4 మూవీకి 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తద్వారా మస్తీ ఫ్రాంచైజీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా మస్తీ 4 నిలిచింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 170 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
మస్తీ 4 కలెక్షన్స్
మస్తీ 4కు తొలిరోజు 2.75 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.75 కోట్ల రూపాయలు, మూడో రోజున 3 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.6 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.6 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయలు చొప్పున తొలి వారం ఇండియాలో 13.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వసూళ్లు కోల్పోతూ వచ్చిన ఈ చిత్రం రెండో వారంలో కేవలం 1.05 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు మస్తీ 4 ఇండియాలో 14.96 కోట్ల రూపాయలు నెట్... 17.66 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో కేవలం 1.65 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 19.31 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
మస్తీ 4కి లాభమెంత? నష్టమెంత?
భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలివారం స్టడీగా వసూళ్లు రాబట్టినప్పటికీ ఆ తర్వాత దే దే ప్యార్ దే 2, 120 బహదూర్, ఇష్క్ తేరే మే తదితర చిత్రాల ధాటికి చతికిలపడింది. ఇక డిసెంబర్ తొలి వారం వచ్చిన భారీ యాక్షన్ మూవీ దురంధర్ దెబ్బకు మస్తీ 4 కోలుకోలేకపోయింది. 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉండగా.. ఈ సినిమా కనీసం 20 కోట్ల రూపాయల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. దాంతో నిర్మాతలకు ఏకంగా 150 కోట్ల రూపాయల భారీ నష్టాలను మిగిల్చింది.
నిర్మాతలు మస్తీ 4 కోసం 80 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించగా.. పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోయింది. బడ్జెట్ పరంగా 60 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చాడు రితేష్ దేశ్‌ముఖ్. శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, డబ్బింగ్, ఆడియో హక్కులు విక్రయించినప్పటికీ ఈ నష్టాన్ని పూడ్చడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మస్తీ ఫ్రాంచైజీలోనే డిజాస్టర్‌గా నిలిచింది మస్తీ 4.


Click it and Unblock the Notifications











