Mastiii 4 Day 1 Collections: మిక్స్‌డ్ టాక్‌తో భారీ వసూళ్లు.. మస్తీ 4కు ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
హిందీ చిత్ర పరిశ్రమలో హిట్ ఫ్రాంచైజీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది మస్తి. అడల్ట్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది ఈ చిత్రం. 2004లో తొలిసారిగా మస్తి, ఆ తర్వాత గ్రాండ్ మస్తి, అనంతరం గ్రేట్ గ్రాండ్ మస్తి పేరుతో మూడు భాగాలుగా ఈ సిరీస్ వచ్చి విజయం సాధించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన చిత్రమే మస్తీ 4. నవంబర్ 21న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మస్తీ 4 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజున ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో పరిశీలిస్తే..
మస్తీ 4 తారాగణం
మస్తీ 4 సినిమాకు మిలాప్ మిలన్ ఝవేరి దర్శకత్వం వహించగా... సినీ 1 స్టూడియోస్, వేవ్ బాండ్ ప్రొడక్షన్స్, మారుతి ఇంటర్నేషనల్, ఎం ఫోర్ ఫిలింస్, బర్కిలీ మీడియా గ్రూప్ బ్యానర్‌లపై అశోక్ తకారియా, ఎస్‌కే అహ్లూవాలియా, ఏ ఝుంజన్‌వాలా, భూషణ్ కుమార్, ఇంద్ర కుమార్, కృషన్ కుమార్, యూ ఫై సూయన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్ శివ్‌దాసాని, జెనీలియా దేశ్‌ముఖ్, ఎల్నాజ్ నౌరౌజీ, నర్గీస్ ఫక్రీ, అర్షద్ వార్సి, నటాలియా జోంజెక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషంచారు. సంకేత్ షా సినిమాటోగ్రాఫర్‌గా, సంజయ్ సంక్లా ఎడిటర్‌గా సేవలందించారు. సంజీవ్ దర్శన్ సంగీత దర్శకత్వం వహించారు.

మస్తీ 4 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ ఖర్చులతో ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలు వ్యయం కాగా.. ప్రింట్స్, అడ్వర్టైజింగ్ కోసం మరో 10 కోట్లు ఖర్చు అయ్యంది. దాంతో మస్తీ 4 మూవీకి 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తద్వారా మస్తీ ఫ్రాంచైజీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా మస్తీ 4 నిలిచింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 170 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
మస్తీ ఫ్రాంచైజీకి వసూళ్ల పంట
గతంలో ఈ సినిమా సాధించిన విజయంతో మస్తీ 4పై భారీ చిత్ర సీమలో భారీ అంచనాలున్నాయి. మస్తీ 20.28 కోట్ల రూపాయలు, గ్రాండ్ మస్తీ 102.5 కోట్ల రూపాయలు, గ్రేట్ గ్రాండ్ మస్తీ 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రాండ్ మస్తీ తొలి రోజున 12.5 కోట్ల రూపాయలు రాబట్టగా.. గ్రేట్ గ్రాండ్ మస్తీ 2.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మస్తీ 4 ఎన్ని కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ రాబడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
మస్తీ 4 తొలి రోజు కలెక్షన్స్ ఎంత?
తొలి రోజు సాయంత్రం 6 గంటల వరకు 10 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా ఇండియా వైడ్‌గా కోటి రూపాయలు రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే మస్తీ 4కు మిక్స్‌డ్ టాక్, మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం... మస్తీ 4కు తొలి రోజున వరల్డ్ వైడ్‌గా 4 నుంచి 4.5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం హిందీలో ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో మస్తీ 4 సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











