Mastiii 4 Day 3 Collections: వివేక్ ఒబెరాయ్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. మస్తీ 4కి మూడో రోజు ఎన్ని కోట్లంటే?

హిందీ చిత్ర పరిశ్రమలో అడల్ట్ కామెడీ సినిమాలు చాలానే వచ్చాయి. వీటిలో హిట్ ఫ్రాంచైజీ కూడా ఒకటి. మస్తి, గ్రాండ్ మస్తి, గ్రేట్ గ్రాండ్ మస్తి పేరుతో మూడు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన చిత్రమే మస్తీ 4. నవంబర్ 21న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మస్తీ 4 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజున ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో పరిశీలిస్తే..

మస్తీ 4 తారాగణం
మస్తీ 4 సినిమాకు మిలాప్ మిలన్ ఝవేరి దర్శకత్వం వహించగా... సినీ 1 స్టూడియోస్, వేవ్ బాండ్ ప్రొడక్షన్స్, మారుతి ఇంటర్నేషనల్, ఎం ఫోర్ ఫిలింస్, బర్కిలీ మీడియా గ్రూప్ బ్యానర్‌లపై అశోక్ తకారియా, ఎస్‌కే అహ్లూవాలియా, ఏ ఝుంజన్‌వాలా, భూషణ్ కుమార్, ఇంద్ర కుమార్, కృషన్ కుమార్, యూ ఫై సూయన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్ శివ్‌దాసాని, జెనీలియా దేశ్‌ముఖ్, ఎల్నాజ్ నౌరౌజీ, నర్గీస్ ఫక్రీ, అర్షద్ వార్సి, నటాలియా జోంజెక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషంచారు. సంకేత్ షా సినిమాటోగ్రాఫర్‌గా, సంజయ్ సంక్లా ఎడిటర్‌గా సేవలందించారు. సంజీవ్ దర్శన్ సంగీత దర్శకత్వం వహించారు.

Mastiii 4 Day 3 Expected Box Office Collections Worldwide Ritesh Deshmukh s Movie surpassing all the obstacles

మస్తీ 4 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ ఖర్చులతో ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలు వ్యయం కాగా.. ప్రింట్స్, అడ్వర్టైజింగ్ కోసం మరో 10 కోట్లు ఖర్చు చేశారు. దాంతో మస్తీ 4 మూవీకి ఓవరాల్‌గా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. మస్తీ 4ను వరల్డ్ వైడ్‌గా 2000కు పైగా స్క్రీన్‌లలో విడుదల చేశారు.

మస్తీ 4 రెండు రోజుల కలెక్షన్స్ ఎంత?
మస్తీ 4 సినిమాకు తొలిరోజున ఇండియాలో 2.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.75 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 5.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్... 6.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక నార్త్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే తదితర దేశాలలో మస్తీ 4 సినిమాకు 75 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఈ అడల్డ్ కామెడీ సినిమాకు రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 7.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

మస్తీ 4 మూడో రోజు కలెక్షన్స్ ఎంత?
ఆదివారం కావడంతో మస్తీ 4కు ఇండియా వైడ్‌కు సాలీడ్ బుకింగ్స్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 120 బహదూర్, దే దే ప్యార్ దే 2 చిత్రాల నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ అర్బన్ ఏరియాలలో టికెట్ సేల్స్ జరుగుతున్నాయి. మస్తీ 4కు మూడో రోజు సాయత్రం 4 గంటల వరకు 6 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. కడపటి సమాచారం వరకు మస్తీ 4కు ఢిల్లీలో 614 షోలు, ముంబైలో 434 షోలు, పూణేలో 206 షోలు, అహ్మదాబాద్‌లో 262 షోలు, బెంగళూరులో 163 షోలు, హైదరాబాద్‌లో 127 షోలు ప్రదర్శితమయ్యాయని సాక్‌నిక్ తెలిపింది. మూడో రోజు రితేష్ దేశ్‌ముఖ్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో మూడు రోజుల్లో మస్తీ 4 సినిమాకు 10.25 కోట్ల రూపాయలు వస్తాయని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X