Mathu Vadalara 2 Day 1 Collections : మత్తు వదలరా 2 కలెక్షన్ల ఊచకోత.. చిన్న సినిమా అనుకుంటే , ఫస్ట్ డే ఎన్ని
ఐదేళ్ల క్రితం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మత్తు వదలరా సంచలన విజయం సాధించింది. కామెడీ, సస్పెన్స్ ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమాకు యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మత్తు వదలరా 2ను తెరకెక్కించారు . శ్రీసింహా, సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు రితేష్ రాణా దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. మరి తొలి రోజు మత్తు వదలరా 2 ఎలాంటి ఓపెనింగ్స్ రాబట్టిందో చూస్తే :
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా ప్రమోషన్ చేయడంతో పాటు ఫస్ట్ పార్ట్ నవ్వులు పూయించడంతో మత్తువదలరా 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్నింగ్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్, రివ్యూలతో మత్తువదలరా 2కి బుకింగ్స్ బాగానే జరిగాయి. శుక్రవారం సాయంత్రం వీకెండ్ స్టార్ట్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శని, ఆదివారాలకు తోడు మార్కెట్‌లో కొత్త సినిమాలేవి లేకపోవడంతో మత్తు వదలరా 2కి మంచి వసూళ్లు దక్కుతాయని ఫిలింనగర్ టాక్.

ఫస్ట్ పార్ట్‌లో డెలివరీ బాయ్స్‌గా తప్పులు చేయడంతో శ్రీసింహా, సత్యలు ఉద్యోగాలు పొగొట్టుకుంటారు. అయితే హై ఎమర్జెన్సీ అనే టీమ్‌లో మరో ఉద్యోగం సంపాదించుకుని అక్కడ కిడ్నాప్ అయిన కేసులను డీల్ చేస్తుంటారు. వచ్చే జీతం ఎందుకూ చాలకపోవడంతో తమకు బాగా తెలిసిన తస్కరణ అనే విద్యను బయటకు తీస్తారు. ఈ క్రమంలో రెండు హత్య కేసుల్లో ఇరుక్కుని చిక్కుల్లో పడతారు. ఈ కేసుల్లోంచి శ్రీసింహా, సత్యలు ఎలా బయటపడ్డారు, ఎవరు వారిని ఇరికించారు అన్నదే మత్తువదలరా 2 కథ.
ఇకపోతే.. ఆల్రెడీ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ కాబట్టి మత్తువదలరా 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్సే ఓన్‌గా రిలీజ్ చేసుకున్నారు. నైజాం రూ.కోటిన్నర, సీడెడ్ రూ.50 లక్షలు, ఆంధ్ర రూ.1.20 కోట్లు , ఏపీ తెలంగాణ కలిపి టోటల్‌గా రూ.3.20 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ రూ.80 లక్షలు, వరల్డ్ వైడ్ టోటల్‌గా రూ.4 కోట్ల మేర మత్తు వదలరా 2 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. పాజిటివ్ టాక్‌లకు తోడు లక్ష్యం చిన్నదే కాబట్టి ఈజీగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

మత్తు వదలరా 2 తొలి రోజు ఇండియా వైడ్‌గా రూ.2.55 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మార్నింగ్ షోస్ డల్‌గా ఉన్నప్పటికీ .. నైట్ షోలు అనూహ్యంగా 60 శాతం ఆక్యూపెన్సీని చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ సిటీలో నైట్ షోస్ 63 శాతం ఆక్యూపెన్సీని సొంతం చేసుకుని రూ.45 లక్షల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మత్తు వదలరా 2 ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్మురేపింది. ఏకంగా లక్షా 50 వేల డాలర్ల మార్క్‌ను చేరుకుందని అంచనా. అమెరికాలో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్‌తో కలిపి 3 లక్షల డాలర్ల మార్క్‌ని చేరుకుని మిలియన్ వైపు పరుగులు తీస్తోంది. అంతేకాదు.. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్‌లు ఫుల్ రన్‌లో సాధించిన వసూళ్లను మత్తువదలరా 2 ఆల్రెడీ అధిగమించి షాకిచ్చింది.


Click it and Unblock the Notifications











