Mathu Vadalara 2 Collections: మత్తు వదలరా కలెక్షన్ల జాతర.. సత్య కామెడీ మూవీకి ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన నాన్ స్టాప్ కామెడీ చిత్రం మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. సెప్టెంబర్ 13వ తేదీన రిలీజైన ఈ సినిమా రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకొంటూ పోవడంతో ట్రేడ్ వర్గాల్లో జోష్ పెరిగింది. మత్తు వదలరా మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత మూడు రోజుల్లో నమోదు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

భారీ అంచనాలతో వచ్చిన మత్తు వదలరా 2 చిత్రంలో శ్రీ సింహా కోడూరి, కమెడియన్ సత్య, సునీల్, అజయ్, ఫరియా అబ్దుల్లా తదితరులు నటించారు. ఈ సినిమాను మైత్రీ సీఈవో చెర్రి అలియాస్ చిరంజీవి నిర్మించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Mathu Vadalara 2 Day 3 Box Office Collection Worldwide Comedian Satya Movie racing towards break Even Target of 18 Crores

మత్తు వదలరా చిత్రం తొలి రోజు చిన్న సినిమాల్లో రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఏపీ, నైజాంలో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో సుమారుగా 500K డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ మూవీ తొలి రోజు 5.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సత్య కామెడీతో సక్సెస్ జోరు సాధిస్తున్న ఈ సినిమా రెండో రోజు కూడా భారీగా వసూళ్లు సాధించింది. శనివారం ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2.1 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 50 లక్షలు రాబట్టింది. దాంతో ఇండియా వైడ్ 3.5 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5.8 కోట్లు రాబట్టడంతో రెండు రోజుల్లోనే 11 కోట్లు వసూలు చేసింది.

Mathu Vadalara 2 Day 3 Box Office Collection Worldwide Comedian Satya Movie racing towards break Even Target of 18 Crores

ఇక మొదటి, రెండో రోజు కంటే మత్తు వదలరా 2 చిత్రం మూడో రోజు భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 50 లక్షలకుపైగా వసూలు చేసింది. దాంతో ఇండియాలో 8 కోట్లకుపైగా వసూలు చేసింది.

ఇక అమెరికాలో ఈ సినిమా 184 లొకేషన్లలో 130K డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో కోటి రూపాయలు రాబట్టింది. ఇతర దేశాల్లో మరో కోటి రూాయలతో ఓవర్సీస్‌లో రెండు కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3వ రోజు 7 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18 కోట్ల రూపాయలు వసూసు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X