Mathu Vadalara 2 Day 4 Collections: కలెక్షన్లతో కుమ్మేస్తున్న మత్తు వదలరా 2.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

టాలీవుడ్‌లో భారీ క్రేజ్, అంచనాలతో వచ్చిన మత్తు వదలరా 2 చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకొంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ చెర్రీ (చిరంజీవి) నిర్మాతగా వ్యవహరించారు. కమెడియన్ సత్య, శ్రీ సింహా కోడూరి, అజయ్, సునీల్, ఫరియా అబ్దుల్లా తదితరులు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13వ తేదీన రిలీజైంది. ఈ సినిమా కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..

తెలుగు సినీ పరిశ్రమలో భారీ విజయం అందుకొన్న మత్తు వదలరా సినిమాకు స్వీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో సుమారుగా 9 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాదాపు 10 కోట్ల రూపాయల షేర్‌గా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Mathu Vadalara 2 Day 4 Box Office Collection Worldwide Comedian Satya Movie reached break Even Target

మత్తు వదలరా 2 చిత్రానికి మంచి రెస్పాన్స్ ఉండటంతో తొలుత 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. రిలీజ్ తర్వాత ఆడియెన్స్ నుంచి డిమాండ్ ఉండటంతో స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ మూవీకి అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతుందని పేర్కొన్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి 2.20 కోట్ల రూపాయలు నికరంగా, రెండో రోజు 3.2 కోట్లు, మూడో రోజు 3.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాతో ఈ చిత్రం 8.2 కోట్ల రూపాయలకుపైగా ఏపీ, నైజాం ఇత ప్రాంతాల్లో రాబట్టింది.

Mathu Vadalara 2 Day 4 Box Office Collection Worldwide Comedian Satya Movie reached break Even Target

3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 5.5 కోట్ల గ్రాస్, రెండో రోజు 5 కోట్ల గ్రాస్, మూడో రోజు 5.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లో 16.2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాదాపు ఈ సినిమా మూడో రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అలాగే మత్తు వదలరా 2 మూవీ 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఆంధ్రా, నైజాం, ఇతర ప్రాంతాల్లో కలిపి సుమారుగా 2 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. దాంతో ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X