Mathu Vadalara 2 Day 5 Collections: మత్తు వదలరా 2కు రికార్డు లాభాలు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

టాలీవుడ్ యువ హీరో శ్రీ సింహా కోడూరి, యువ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, టాప్ కమెడియన్లు సత్య, వెన్నెల కిషోర్, అజయ్, సునీల్ తదితరులు నటించిన చిత్రం మత్తు వదలరా 2. మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ అలియాస్ చిరంజీవి ఈ సినిమాను నిర్మించగా యంగ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

2018 సంవత్సరంలో భారీ విజయం అందుకొన్న మత్తు వదలరా సినిమాకు స్వీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో సుమారుగా 9 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మత్తు వదలరా 2 చిత్రానికి మంచి రెస్పాన్స్ ఉండటంతో తొలుత 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. దాదాపు 10 కోట్ల రూపాయల షేర్‌గా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Mathu Vadalara 2 Day 5 Box Office Collection Worldwide Comedian Satya Movie reached break Even Target

సత్య కామెడీ ట్రాక్ వర్కవుట్ కావడంతో మత్తు వదలరా 2 చిత్రానికి అనూహ్యమైన స్పందన సినీ, క్రిటిక్స్, సాధారణ ప్రజల నుంచి వస్తున్నది. ఈ క్రమంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడమే కాకుండా 4వ రోజునే బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. ఇక ఐదో రోజు వినాయక నిమజ్జనం సంబరాల్లో కూడా నిలకడగా వసూళ్లు సాధించింది.

మత్తు వదలరా 2 సినిమా కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 2.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.2 కోట్లు, మూడో రోజు 3.5 కోట్ల రూపాయలు, 4వ రోజు ఈ సినిమా 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా సుమారుగా 11 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఐదో రోజు కూడా మత్తు వదలరా 2 చిత్రానికి థియేటర్లలో మంచి రెస్సాన్స్ లభించింది. ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. దాంతో ఈ చిత్రం 12.5 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేసింది.

Mathu Vadalara 2 Day 5 Box Office Collection Worldwide Comedian Satya Movie reached break Even Target

ఓవర్సీస్‌లో కూడా మత్తు వదలరా 2 సినిమాకు ఆదరణ బ్రహ్మండంగా కనిపిస్తున్నది. ఈ సినిమా ప్రీమియర్లు, తొలి రోజు కలిపి 300, రెండో రోజు 200K, మూడో రోజు 141K, నాలుగో రోజు 55k డాలర్లతో మొత్తంగా 700K డాలర్లు అంటే.. 6 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఇక ఐదో రోజు 55K డాలర్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 755K డాలర్లు అంటే.. 6.35 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

మత్తు వదలరా చిత్రం గత 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఇండియాలో 12.5 కోట్లు, నార్త్ అమెరికాలో 6.35 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా సుమారుగా 19 కోట్లు రాబట్టడం ద్వారా లాభాల జోన్‌లోకి ప్రవేశించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X