Mathu Vadalara Collections: వారంలోనే భారీ లాభాల్లో మత్తు వదలరా 2.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

క్రైమ్, కామెడీ అంశాలతో రూపొందిన మత్తు వదలరా 2 చిత్రం భారీ లాభాలతో దూసుకెళ్తున్నది. శ్రీ సింహా, కమెడియన్ సత్య, అజయ్, సునీల్, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ రెండో వారంలోకి ప్రవేశించడమే కాకుండా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత 7 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

2018 సంవత్సరంలో ఘన విజయం సాధించిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 16 కోట్ల రూపాయలతో నిర్మించారు. మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ రూపొందించిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 9 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను తొలుత 1000 స్క్రీన్లలో రిలీజ్ చేయగా.. ఆ తర్వాత భారీగా ఆదరణ దక్కడంతో స్క్రీన్ల కౌంట్‌ను పెంచారు. ఈ సినిమా సుమారుగా 10 కోట్ల థియేట్రికల్ వాల్యూతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Mathu Vadalara 2 Day 7 Box Office Collection Worldwide Comedian Satya Movie in huge profit

మత్తు వదలరా చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తొలి రోజు గ్రాండ్‌గా రెస్సాన్స్ లభించింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2.45 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్‌లో 2.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు 3.5 కోట్లు నికరంగా 5 కోట్లు గ్రాస్, మూడో రోజు 3.5 కోట్లు నికరంగా 5.5 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో తొలివారాంతంలో 16 కోట్లు వసూలు చేసింది.

ఇక తొలివారంలో 4వ రోజున 1.5 కోట్లు నికరంగా 2.4 కోట్లు గ్రాస్, ఐదో రోజున 1.2 కోట్లు నికరంగా 2.6 కోట్లు, ఆరో రోజున 80 లక్షల నికరంగా 1.6 గ్రాస్, ఏడో రోజున 70 లక్షలు నికరంగా 1.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 7 రోజుల్లో 24 కోట్ల గ్రాస్, 12 కోట్లకుపైగా నికరంగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 25.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

Mathu Vadalara 2 Day 7 Box Office Collection Worldwide Comedian Satya Movie in huge profit

మత్తు వదలరా 2 చిత్రానికి నార్త్ అమెరికాలో మంచి స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం 7వ రోజున అమెరికా, కెనడాలో కలిపి 144 లొకేషన్లలో 45K డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 900K అంటే.. సుమారుగా 7.5 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మత్తు వదలరా 2 చిత్రం సుమారుగా 18 కోట్ల గ్రాస్, 10 కోట్లకుపైగా షేర్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం 7 రోజుల్లో 25 కోట్లకుపైగా గ్రాస్, 11 కోట్లకుపైగా నికరంగా వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా మొదటి వారంలోనే బ్రేక్ టార్గెట్‌ను అందుకొని భారీ లాభాల దిశగా వసూళ్లను రాబడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X