Mathu Vadalara 2 Box Office: మత్తు వదలరా 2 బాక్సాఫీస్ ఊచకోత.. చిన్న మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకొన్న మత్తు వదలరా సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మత్తు వదలరా 2 సినిమా భారీగా వసూళ్లను సాధిస్తున్నది. సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రియాక్షన్‌తో దూసుకెళ్తున్నది. శ్రీ సింహా కోడూరి, కమెడియన్స్ సత్య, సునిల్, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మత్తు వదలరా 2 సినిమాను నిర్మాత చెర్రీ (చిరంజీవి) భారీ బడ్జెట్‌తో రూపొందించారు. క్వాలిటీ కోసం ఎలాంటి రాజీ లేకుండా రిచ్‌గా సినిమాను అందించారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లోను స్పష్టమవుతుంది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 16 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మత్తు వదలరా సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ఈ మూవీకి రిలీజ్‌కు ముందే భారీ బజ్ క్రియేట్ అయింది. రాజమౌళి ప్రమోషన్స్, ఇతర ప్రచార కార్యక్రమాలతో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు మొత్తంగా 9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకు క్రేజ్ ఎక్కువగా ఉండటంతో సుమారుగా 1000 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు.
మత్తు వదలరా 2 సినిమాకు నార్త్ అమెరికాలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 137K,తొలి రోజు 166K కలెక్షన్లతో మొత్తంగా 302K డాలర్లను రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా 186 లోకేషన్లలో 200K డాలర్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో సినిమా అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 4.5 కోట్లు వసూలు చేసింది.

సత్య తన కామెడీతో సక్సెస్ రూట్ పట్టించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రియాక్షన్ లభిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 2.15 కోట్ల రూపాయలు నికరంగా, రెండో రోజు 3.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా 5.35 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేస్తున్నది.
మత్తు వదలరా 2 సినిమా సుమారుగా 18 కోట్ల గ్రాస్, 9 కోట్ల షేర్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా 9 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతుండటం మంచి లాభాలు సాధిస్తుందనే ఆశాభావం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











