Matka Day 1 Collection.. షాకింగ్‌గా మట్కా కలెక్షన్లు.. వరుణ్ తేజ్‌ మూవీకి ఎన్ని కోట్లంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించిన చిత్రం మట్కా. పలాస లాంటి హిట్స్ అందించిన కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 14వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?, సాధిస్తున్న కలెక్షన్ల ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

మట్కా చిత్ర కథ విషయానికి వస్తే.. బర్మా నుంచి శరణార్తిగా వచ్చిన వాసు అనే యువకుడిగా జీవిత కథనే ఈ సినిమా. 70 నుంచి 90 దశకంలో పాపులర్ అయిన మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమాను పూర్తిగా పీరియాడిక్ మూవీగా తెరకెక్కించారు. ప్రేక్షకులను 70 దశలోకి తీసుకెళ్లడానికి పూర్తిగా భారీ సెట్స్ వేశారు. నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్‌తో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

Matka Telugu Movie Day 1 Box Office Collection Worldwide Varun Tej s Cineam Decent Start at GBOC

మట్కా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై బజ్ భారీగా ఉండటంతో రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ అయ్యేులా బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ థియేట్రికల్ హక్కులు 8 కోట్లు, ఆంధ్రా రైట్స్ 7 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇతర రాష్ట్రాల హక్కులు 1.5 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 2.5 కోట్ల మేర జరగడంతో మొత్తంగా 19 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మట్కా సినిమాపై హైప్ బాగా క్రియేట్ కావడంతో ఈ సినిమాను అత్యధికంగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 600 స్క్రీన్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి 300 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను మొత్తంగా 1250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.

Matka Telugu Movie Day 1 Box Office Collection Worldwide Varun Tej s Cineam Decent Start at GBOC

ఇక మట్కా మూవీ తొలి రోజు గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో 4 నుంచి 5 కోట్ల గ్రాస్, అలాగే ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా ఓవరాల్‌గా 7 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X