Matka Day 2 Collections: మట్కా కలెక్షన్లు ఇంత దారుణంగానా? వరుణ్ తేజ్‌కు బిగ్ షాకే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన చిత్రం మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్, వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా దెబ్బ కొట్టింది. అయితే గత 2 రోజుల కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

వైజాగ్ ప్రాంతంలో 70వ దశకం నేపథ్యంగా రూపొందిన మట్కా గ్యాబ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం కథ బలంగా ఉన్నప్పటికీ.. నేరేషన్ చాలా వీక్ ఉండటంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో కలెక్షన్లు పేలవంగా నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వారాంతంలో పుంజుకుంటుందా? అనే ప్రశ్న మొదలైంది.

Matka Telugu Movie Day 2 Box Office Collection Worldwide Varun Tej movie struggling at GBOC

అయితే ఈ వారం రిలీజైన కంగువ చిత్రం మట్కాపై భారీ ప్రభావం చూపించింది. రెండు సినిమాలు పోటీ పడటంతో బాక్సాఫీస్ వద్ద మట్కా తేలిపోయింది. భారీ బడ్జెట్, సూర్య లాంటి అంశాలు ఆ సినిమావైపు మొగ్దు చూపేలా చేశాయి. కానీ ఆ సినిమాపై కూడా నెగిటివిటి ఉండటం ఈ మూవీ కలెక్షన్లపై ఆశలు రేపుతున్నది. అయితే సెలవుదినాల్లో ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందనే విషయం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

మట్కా చిత్ర కథ విషయానికి వస్తే.. బర్మా నుంచి శరణార్తిగా వచ్చిన వాసు అనే యువకుడిగా జీవిత కథనే ఈ సినిమా. 70 నుంచి 90 దశకంలో పాపులర్ అయిన మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమాను పూర్తిగా పీరియాడిక్ మూవీగా తెరకెక్కించారు. ప్రేక్షకులను 70 దశలోకి తీసుకెళ్లడానికి పూర్తిగా భారీ సెట్స్ వేశారు. నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్‌తో కలిపి ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. 18 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Matka Telugu Movie Day 2 Box Office Collection Worldwide Varun Tej movie struggling at GBOC

మట్కా చిత్రం దాదాపు 18 కోట్లకుపైగా షేర్ 36 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా తొలి రోజు 2 కోట్ల రూపాయల గ్లాస్ వసూళ్లను నమోదు చేసింది. అయితే వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇంత తక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఈ మధ్య కాలంలో లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉండటే.. ఈ సినిమా రెండో రోజు కూడా అత్యంత పేలవంగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ 2వ రోజు 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను వరల్డ్ వైడ్‌గా నమోదు చేస్తుందని అంచనా వేశారు.దాంతో రెండో రోజుల్లో ఈ సినిమా 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇలా కలెక్షన్లు రాబడితే భారీ నష్టాల్లో ముగిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X