Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Matti Kusthi Collections: విష్ణు మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. తొలిరోజే ఇలానా.. రవితేజకు బిగ్ షాక్!
ఇండియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీపై అన్ని భాషలకు చెందిన ఫిల్మ్ మేకర్లు ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ తమ తమ చిత్రాలను విడుదల చేసి వీలైనన్ని ఎక్కువ కలెక్షన్లను రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దక్షిణాదితో పాటు బాలీవుడ్ నుంచి ఇప్పటికే ఎన్నో చిత్రాలను విడుదల చేసి క్యాష్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'మట్టి కుస్తీ'. కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రం.. గత శుక్రవారమే తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల అయింది.
టాప్ విప్పేసిన తెలుగు హీరోయిన్: ఏం చూపించకూడదో అక్కడే హైలైట్ చేసి!
ఇప్పటికే పలు చిత్రాలతో తెలుగులో ఫేమస్ అయిన విష్ణు విశాల్ నటించిన చిత్రం కావడం.. టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నిర్మించడంతో 'మట్టి కుస్తీ'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి ఇది గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనికితోడు మరోవైపు 'హిట్ 2' మూవీ హవా చూపించడంతో 'మట్టి కుస్తీ' తొలి రోజే తేలిపోయింది. దీంతో దీనికి ఆశించిన రీతిలో స్పందన రాలేదు.

విష్ణు విశాల్ నటించిన 'మట్టి కుస్తీ' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన దాని కంటే చాలా తక్కువ వసూళ్లు దక్కాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి శుక్రవారం కేవలం రూ. 40 లక్షలు గ్రాస్ మాత్రమే దక్కింది. అంటే.. దీనికి రూ. 20 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది. దీంతో 2.20 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. హిట్‌గా నిలవాలంటే ఇంకా రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువే వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిధి అగర్వాల్ ఎద అందాల ఆరబోత: హద్దు దాటేసి మరీ హాట్ షో
ఇదిలా ఉండగా.. తమిళనాడులో కూడా 'మట్టి కుస్తీ' సినిమాకు ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. అక్కడ మొత్తం మీద ఈ చిత్రం కోటి రూపాయలు లోపు గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరీ ఈ వీకెండ్లో ఇది పుంజుకుంటేనే హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.