Don't Miss!
- News
Jewelery: మా బంగారం, జ్యువెలరీ షోరూమ్ ఓనర్లకు సినిమా చూపించిన ఐటీ శాఖ, అర్దరాత్రి సెకండ్ షో !
- Finance
February 1st: కొత్త నెల మారిన రూల్స్.. తప్పక తెలుసుకోండి.. గోవా పర్యాటకులకు ప్రత్యేకం..
- Sports
INDvsNZ : సిరీస్ డిసైడర్‌లో టీమిండియా హిస్టరీ రిపీట్ చేస్తుందా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Matti Kusthi: డబ్బింగ్ మూవీకి మంచి బిజినెస్.. చక్రం తిప్పిన రవితేజ
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తోంది. మన మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఎంతో మంది చిన్న పెద్ద హీరోలు తమ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఫిల్మ్ మేకర్లు కూడా అదే ప్లాన్‌తో ముందుకు వస్తున్నారు. ఇలా ఈ ఏడాది విడుదలైన ఎన్నో డబ్బింగ్ మూవీలు ఘన విజయాలను సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మట్టి కుస్తీ' అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ నటించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతుంది.
Bigg Boss Elimination: 13వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరంటే!
విష్ణు విశాల్ నటించిన 'మట్టి కుస్తీ' మూవీని చెల్ల అయ్యవు అనే దర్శకుడు తెరకెక్కించాడు. దీనికి మన స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక, ఈ మూవీ డిసెంబర్ 2వ తేదీన రాబోతుండడంతో చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, శుక్రవారమే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ లభిస్తుండడంతో.. విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' మూవీపై సుడిగాలి సినీ ప్రియులంతా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలను కలుపుకుని మొత్తంగా ఈ సినిమాకు రూ. 2.00 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని నైజాంలో 90, సీడెడ్‌లో 50, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 120 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 250 థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.
సెల్ఫీలో పూజా హెగ్డే క్లీవేజ్ షో: టాప్ నుంచి చూపిస్తూ అరాచకం

గ్రామీణ క్రీడ నేపథ్యంతో రాబోతున్న 'మట్టి కుస్తీ' మూవీలో విష్ణు విశాల్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. దీన్ని విష్ణు, రవితేజ, శుభ్ర, ఆర్యన్ రమేష్‌లు సంయుక్తంగా నిర్మించారు. జస్టిన్ ప్రభాకరణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇందులో శ్రీజా రవి, గజరాజ్, కరుణాస్, మునీష్‌కాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.