మాయాజాలం బయ్యర్ల కంట జలం
ఎస్వీ కృష్ణారెడ్డి- శ్రీకాంత్‌ల మాయాజాలం బయ్యర్లకు, నిర్మాతలకు నిరాశ మిగుల్చుతోంది. శ్రీకాంత్ ఫ్లాప్‌ల పరంపరలో ఇదొకటి. పూర్తి స్ధాయిలో హాస్యం పండిద్దామనుకున్నా ప్రధాన పాత్ర ఎక్కడా యాక్టివ్ కాకపోవడంతో ఆశించిన బిగి రాలేదు, ఊహించిన వినోదం అందలేదు. ఇక ఇవివి సత్యనారాయణ కితకితలుపౌ వేసవిలో ప్రేక్షకులు తొలిరోజుల్లో కుతకుతలాడినా ఈ సినిమాలోని ముతక హాస్యం బి, సి సెంటర్లలో పట్టే అవకాశముంది. ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతో ఖర్చుతో తీసిన మాయాజాలం కంటే కలెక్షన్ల పరంగా ఈ సినిమా కొంత మెరుగు. మహేష్‌బాబు- పూరీ జగన్నాధ్‌ల పోకిరి దిగ్విజయంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రధమార్ధంలో ఎదురులేని సినిమాగా పోకిరి నిలిచింది. రెండు వారాల్లో ఈ సినిమా 15 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే దీని రేంజిని అర్ధం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications