Mazaka Closing Collections: మజాకా హిట్టా? ఫట్టా? సందీప్ కిషన్ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
దక్షిణాదిలో యువ హీరో, హీరోయిన్లు సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా, రావు రమేష్, మన్మథుడు ఫేమ్ అన్షు ప్రత్యేక పాత్రలో నటించిన మజాకా చిత్రం రొమాంటిక్ కామెడీగా రూపొందింది. ధమాకా ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు AK ఎంటర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండ, అనీల్ సుంకర, ఉమేష్ భన్సాల్ నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఓ ఎమోషనల్ పాయింట్‌తో తెరకెక్కిన మజాకా చిత్రానికి ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్‌గా లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ తదితరులు సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. మురళీ శర్మ, శ్రీనివాసరెడ్డి తదితర ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటించారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం మీడియం రేంజ్‌లో అయింది. ఈ చిత్రం సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు.

ఇక మజాకా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రా, నైజాం హక్కులు 9 కోట్ల రూపాయల మేర, ఓవర్సీస్ రైట్స్ 1 కోటి రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 50 లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌గా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బిజినెస్ 10.5 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లుగా నిర్ధారించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 750 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
మజాకా చిత్రం భారీ కాకున్నా ఓ మోస్తారుగా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా పాజిటివ్‌గానే వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ రిజల్డ్‌పై ప్రభావం పడింది. దాంతో తొలి రెండు, మూడు రోజుల్లో సానుకూలమైన వసూళ్లను రాబట్టినా ఆ తర్వాత నిలకడగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
ఇక మజాకా చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 1.5 కోట్లు, మూడో రోజు 1.5 కోట్లు, నాలుగో రోజు 2 కోట్ల గ్రాస్, ఐదో రోజు 1.8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక 6వ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లను అతికష్టం మీద రాబట్టింది. ఆరో రోజున 60 లక్షల గ్రాస్, ఏడో రోజు 50 లక్షలు, 8వ రోజు 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మజాకా చిత్రం తొలివారమే దాదాపు థియేట్రికల్ రన్‌ను ముగించింది. ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో 9 కోట్ల నెట్, 10.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో ఈ సినిమా 1 కోటి రూపాయలు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 11.5 కోట్ల క్లోజింగ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ముగించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 12 కోట్ల రావాల్సి ఉండగా.. 50 లక్షల నష్టంతో థియేట్రికల్‌గా వసూళ్ల యాత్ర క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications











