Mazaka Day 1 Collections: షాకింగ్‌గా మజాకా కలెక్షన్లు.. సందీప్ కిషన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు AK ఎంటర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండ, అనీల్ సుంకర, ఉమేష్ భన్సాల్ నిర్మించిన చిత్రం మజాకా. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించగా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షు జంటలుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన మజాకా చిత్రానికి ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్‌గా లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ తదితరులు సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. మురళీ శర్మ, శ్రీనివాసరెడ్డి తదితర ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటించారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం మీడియం రేంజ్‌లో అయింది. ఈ చిత్రం సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ధమాకా లాంటి భారీ హిట్ తర్వాత నక్కిన త్రినాథ్ రావు సినిమా రావడం, అలాగే ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ మూవీ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరిగింది. సందీప్ కిషన్ నటించిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించడంతో ఈ సినిమాపై బయ్యర్లు పాజిటివ్‌గా స్పందించినట్టు తెలిసింది.
ఇక మజాకా సినిమా ఆంధ్రా, నైజాం హక్కులు 9 కోట్ల రూపాయల మేర, ఓవర్సీస్ రైట్స్ 1 కోటి రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 50 లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌గా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బిజినెస్ 10.5 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లుగా నిర్ధారించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 750 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
మజాకా చిత్రం రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించాయి. శివరాత్రి కావడంతో నైట్ షోలకు మంచి డిమాండ్ కనిపించింది. దాంతో ఆంధ్రా, నైజాంలో పాజిటివ్‌గా కలెక్షన్లు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.5 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 50 లక్షల నెట్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 40 లక్షల రూపాయలు నెట్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం ఓవరాల్‌గా 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని పేర్కొన్నారు.
సందీప్ కిషన్ సినిమా ఓపెనింగ్స్ విషయానికి వస్తే.. గత చిత్రం ఊరు పేరు భైరవకోన చిత్రం సుమారుగా 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాతో పోల్చుకొంటే స్వల్పంగా తక్కువగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేస్తుందా? అనేది రానున్న రోజుల్లో వచ్చే కలెక్షన్లను బట్టి తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











