For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంసీఏకు దిమ్మతిరిగే కలెక్షన్లు.. నాని కెరీర్‌లోనే రికార్డు..క్రిటిక్స్ షాకిచ్చిన దిల్ రాజు

    By Rajababu
    |

    2017లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర సాగిస్తున్నాడు. నాని నటించిన ఎంసీఏ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో కలెక్షన్లు తుఫాన్‌గా మారాయి. ఈ చిత్రం ఐదురోజుల్లోనే 30 కోట్లు వసూలు చేయడం నాని స్టామినాకు అద్దంపట్టాయి.

    పేరుకే ‘మిడిల్ క్లాస్’.... కలెక్షన్లు మాత్రం అలా లేవు!
    ఎంసీఏకు డివైడ్ టాక్‌

    ఎంసీఏకు డివైడ్ టాక్‌

    అందాల తారలు సాయి పల్లవి, భూమిక చావ్లా, నాని నటించిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ చిత్రంపై రివ్యూలు మిశ్రమంగా ఉన్నాయి. దాంతో ఈ చిత్రం కలెక్షన్లపై కొంత అనుమానాలు తలెత్తాయి.

    సినీ రివ్యూలను ఎదురించి

    సినీ రివ్యూలను ఎదురించి

    కానీ సినీ విమర్శకుల మిక్స్‌డ్ రివ్యూలను ఎదురించి బాక్సాఫీస్ వద్ద నాని విజయ ఢంకా మోగించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో ఎంసీఏ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతున్నది.

    అమెరికాలో వసూళ్లు

    అమెరికాలో వసూళ్లు

    అమెరికాలో ఈ చిత్రం దిమ్మతిరిగే కలెక్షన్లు వచ్చాయి. బుధవారం ఈ చిత్రం 109,966 డాలర్లు, శనివారం 112, 966 డాలర్లు, ఆదివారం 77,039 డాలర్లు వసూలు చేసింది. ఎంసీఏ చిత్రం మొత్తంగా 722,857 డాలర్లు అంటే సుమారు 4.63 కోట్లు వసూళు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నాడు.

    ఎంసీఏకు 70 కోట్ల గ్రాస్

    ఎంసీఏకు 70 కోట్ల గ్రాస్

    మీడియా కథనాల ప్రకారం.. ఎంసీఏ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 కోట్ల (నికరంగా 30 కోట్లకుపైగా)కు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు సమాచారం. తొలిరోజున 15.21 కోట్లు, రెండో రోజున 16.65 కోట్లు, మూడో రోజున 16.70 కోట్లు, నాలుగో రోజున 17 కోట్లు, ఐదో రోజున 15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్టు అంచనా.

    నాని కెరీర్‌లోనే అత్యధికంగా

    నాని కెరీర్‌లోనే అత్యధికంగా

    ఎంసీఏ కలెక్షన్లు నాని కెరీర్‌లోనే అత్యథికంగా సాధించిన వసూళ్లుగా ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. గత రెండేళ్లలో నానికి ఇది ఏడో విజయం. వరుస విజయాలతో నాని, చిత్ర నిర్మాత దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ సాధించడం విశేషం.

    ఎంసీఏకు భారీ కలెక్షన్లు

    ఎంసీఏకు భారీ కలెక్షన్లు

    ఎంసీఏ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎంసీఏ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. కాలేజీ యూట్, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విశేష స్పందన వస్తున్నది అని ఆయన చెప్పారు.

    టాలీవుడ్‌కు భూమిక మరోసారి

    టాలీవుడ్‌కు భూమిక మరోసారి

    టాలీవుడ్‌కు దూరమైన భూమిక మళ్లీ ఈ చిత్రం ద్వారా మెరిసింది. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించిన ఆమె మరోసారి ప్రేక్షకాదరణను చూరగొన్నారు. ఈ చిత్రంలో భూమిక నానికి వదినగా నటించిన సంగతి తెలిసిందే. భూమిక పాత్రకు ఫ్యామిలీ ఆడియోన్స్ నుంచి మంచి ఆదరణ వ్యక్తమవుతున్నది.

    English summary
    Nani's film works wonders despite mixed reviews. Nani's film has minted around Rs 30 crore worldwide, and has been doing good business in the United States. As per reports, the film has allegedly minted about Rs 30 crore worldwide. Trade analyst Taran Adarsh claimed that the film has so far collected Rs 4.6 crore in the United States. He took to Twitter to share the numbers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X