ఎంసీఏ కలెక్షన్ల హోరు.. 50 కోట్ల క్లబ్‌లో నాని.. కలెక్షన్ల సునామీ
Recommended Video

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి నటించిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నది. ఈ చిత్రానికి వచ్చిన డివైడ్ టాక్ ఎదురించి కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఈ చిత్రం నానిని స్టార్‌గా మరో మెట్టు ఎక్కించింది. ఎంసీఏ వసూళ్లు ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

50 కోట్ల క్లబ్‌లో నాని
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎంసీఏ చిత్రం గత ఎనిమిది రోజుల్లో రూ.51.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నికరంగా ఈ చిత్రం రూ.30 కోట్లకుపైగానే వసూలు చేసినట్టు తెలుస్తున్నది.

మిగితా చిత్రాల జోరు
ఎంసీఏ చిత్రంతో విడుదలైన చిత్రాలు అంతగా ప్రభావం చూపకపోవడం, ఆ తర్వాత వారానికి విడుదలైన చిత్రాలకు కూడా అంత గొప్ప టాక్ రాకపోవడం ఎంసీఏకు అనుకూలంగా మారింది.

నైజాంలో కలెక్షన్ల హోరు
వరంగల్ నేపథ్యంగా తెరకెక్కిన ఎంసీఏ చిత్రానికి తెలంగాణ ప్రాంతంలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం నైజాంలో సుమారు రూ.18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. మరో రూ.5 కోట్లు సునాయాసంగా వసూలు చేయవచ్చనే మాట వినిపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో ఎంసీఏ కలెక్షన్లు ప్రాంతాల వారీగా ఇలా ఉన్నాయి. నైజాంలో నికరంగా 11 కోట్లు, వైజాగ్‌లో 3 కోట్లు, ఈస్ట్ గోదావరిలో సుమారు 2 కోట్లు, పశ్చిమ గోదావరిలో 1.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.76 కోట్లు, నెల్లూరులో 1 కోటి, సీడెడ్‌లో 3.6 కోట్లతో మొత్తం 25 కోట్లు (గ్రాస్ 40 కోట్లు) వసూలు చేసినట్టు సమాచారం.

ఓవర్సీస్‌లోనూ దుమ్ము రేపుతున్న
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఎంసీఏ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. అమెరికాలో సుమారు 3 కోట్లు, మిగితా దేశాల్లో రూ.1 కోటి వసూలు చేసింది. ఇక కర్టాటకలో రూ.1.42 కోట్లు వసూలు చేయడం గమనార్హం. అలా ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల నికర వసూళ్లను, 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం గమనార్హం.

మూడోసారి నాని 30 కోట్ల క్లబ్‌లో
ఎంసీఏ చిత్రంతో నాని మరోసారి రూ.30 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరాడు. గతంలో ఈగ, నేను లోకల్ చిత్రాలు రూ.30 కోట్లకుపైగా వసూళ్లను సాధించాయి. నాని క్రేజ్‌తోపాటు సాయి పల్లవి నటన, భూమిక రీ ఎంట్రీ ఈ సినిమాకు సానుకూలంగా మారిందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











